Connect with us

Arts

TANA కళాశాల @ Charlotte: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కూచిపూడి ప్రాక్టికల్‌ పరీక్షలు పూర్తి

Published

on

Charlotte, North Carolina: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్‌పిఎంవివి), తిరుపతి, అనుబంధ సంస్థ అయిన తానా కళాశాల (TANA Kalasala), చార్లెట్‌లో కూచిపూడి ప్రాక్టికల్‌ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షలను పర్యవేక్షించి, నిర్వహించడానికి తిరుపతి నుండి విచ్చేసిన డా. ఉప్పరి హిమబిందు (ఎం.పి.ఎ. డ్యాన్స్‌, ఎం.ఫిల్‌., పి.హెచ్‌.డి.

మరియు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మ్యూజిక్‌, డ్యాన్స్‌, ఫైన్‌ ఆర్ట్స్‌, ఎస్‌పిఎంవివి) గారిని తానా సగౌరవంగా ఆహ్వానించింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక తానా చార్లెట్‌ (TANA Charlotte Chapter) బృందం నాయకులు నాని వడ్లమూడి, కిరణ్‌ కొత్తపల్లి, టాగూర్‌ మల్లినేని, మాధురి ఏలూరి మరియు నాగ పంచుమర్తి సమన్వయం చేసి, డా. హిమబిందు గారికి మరియు ఉపాధ్యాయురాలు ఝాన్సీ గారికి ఘనంగా సత్కారం అందించారు.

అలాగే, పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ ఈ బృందం శుభాకాంక్షలు తెలియజేసింది. తానా కార్యక్రమాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఈ కార్యక్రమం నిలిచింది, డాన్స్‌ మరియు సంగీతంలో ఉన్నత డిప్లొమా కోర్సు (Diploma Course) లను తీసుకురావడానికి తానా, ఎస్‌పిఎంవివితో భాగస్వామ్యం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇది సాంస్కృతిక మరియు విద్యా సంబంధాలను మరింత పటిష్టం చేసింది. స్థానికంగా ఉన్న కళాకారులు తానా కళాశాల ద్వారా తమ కళను మెరుగుపరుచుకునే అవకాశం లభించింది. తానా అధ్యక్షుడు నరేన్‌ కొడాలి (Naren Kodali), తానా వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీని లావు (Srini Lavu), తానా కళాశాల నిర్వాహకులు మాలతి నాగభైరవ (Malathi Nagabhairava) తదితరులు ఇందులో పాల్గొన్న స్టూడెంట్లకు అభినందనలు తెలియజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected