గత ఎన్నికల్లో విజయం సాధించిన ప్రస్తుత అమెరికా అధ్యక్షుడుజో బైడెన్ కు మద్దతు తగ్గుతున్నట్లు తెలుస్తుంది. అధ్యక్ష పీఠం ఎక్కినప్పటినుంచి ఇప్పటివరకు పాపులారిటీ గ్రాఫ్ క్రమేపీ పడుతూ వస్తుంది. ఈ మధ్యనే చేసిన హార్వర్డ్-హ్యారిస్ సర్వేలో 62 శాతం ప్రజలు జూన్ మొదట్లో మద్దతు తెలపారు. కానీ జూన్ నెలాఖరికి వచ్చేసరికి ఆ మద్దతు కాస్తా 10 శాతం తగ్గి 52 శాతానికి చేరిందట. దీనికి ముఖ్య కారణం డెల్టా వేరియంట్ కోవిడ్ కేసులు పెరగడమేనట. కొంతమంది ఆర్థిక వ్యవస్థపై కూడా అనుమానాల్ని వెలిబుచ్చారట. ముందు ముందు బైడెన్ గ్రాఫ్ పైకి లేస్తుందో లేక ఇంకా కిందకి పడుతుందో కాలమే నిర్ణయించాలి.