Connect with us

Employment

NRI TDP Empowerment: 27 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత

Published

on

తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబునాయుడు గారి ఆలోచన లో భాగంగా డాక్టర్ రవి వేమూరు గారి సారధ్యంలో గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంతోమంది నిరుద్యోగ యువతకు పలు రంగాలలో శిక్షణ కార్యక్రమాలను ఎన్నారై టిడిపి సెల్ ఎంపవర్మెంట్ సెంటర్ నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

అదేవిధంగా ఈ ఎంపవర్మెంట్ సెల్ విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారై లను మంగళగిరిలో వారి యొక్క సంస్థ బ్రాంచ్ లను ప్రారంభించే విధంగా ప్రోత్సహిస్తుంది. తదుపరి ఈ సంస్థల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు 27 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగ నియామక పత్రాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది.

ఈ క్రమంలో ఉద్యోగాలను ఎన్ఆర్ఐ లచే ప్రారంభించబడిన సంస్థలైన J1C లో ఏడుగురికి, Sanity Staffing Solutions లో ఏడుగురికి, Riverside solutions లో ఆరుగురికి, CGV Tech లో ముగ్గురికి, Maganti solutions లో నలుగురికి మొత్తంగా 27 మందికి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.

ఉద్యోగాలు అందుకున్న యువతీ యువకులతో పాటుగా ఇక్కడ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి హిమబిందు, భవాని, ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కోఆర్డినేటర్లు బుచ్చి రాంప్రసాద్, చప్పిడి రాజశేఖర్ మరియు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected