Las Vegas, Nevada: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తదుపరి అధ్యక్షునిగా జయంత్ చల్లా ప్రమాణస్వీకారం చేశారు. ఆటా ప్రస్తుత అధ్యక్షురాలు మధు బొమ్మినేని నుంచి 2025-26 కాలానికి గానూ అధ్యక్ష బాధ్యతలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జయంత్ సతీమణి కవిత చల్లా కూడా ఉన్నారు.
లాస్ వేగాస్ (Las Vegas, Nevada) లో నిన్నజనవరి 18న నిర్వహించిన ఆటాబోర్డు సమావేశంలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా ఉన్న జయంత్ చల్లా (Jayanth Challa) దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకున్నారు. జయంత్ చల్లా ప్రస్తుతం వర్జీనియా (Virginia) లో నివసిస్తున్నారు.
ఇదే ఆటా (American Telugu Association – ATA) బోర్డ్ సమావేశంలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎన్నిక విషయంలో రగడ జరిగినట్టు తెలుస్తుంది. ఈ గందరగోళం, ఏమైంది అన్నటువంటు మరిన్ని విషయాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.