Connect with us

Community Service

TTA BOD దివాకర్ జంద్యం ప్రాయోజకత్వంలో కృత్రిమ అవయవాల పంపిణీ & దంత పరీక్షా శిబిరం @ Warangal, Telangana

Published

on

Warangal, Telangana: 2025 జనవరి 10, శుక్రవారం నాడు హన్మకొండ శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ ఆడిటోరియం లో వరంగల్ కు చెందిన  ఎన్.ఆర్.ఐ  – వెంటోలియిస్ సంస్థ సీఈఓ శ్రీ సుమన్ రెడ్డి కోటా (Suman Reddy Kota), అదేవిధంగా వరంగల్ కు చెందిన మరో ఎన్.ఆర్.ఐ Telangana American Telugu Association (TTA) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ దివాకర్ జంద్యం (Dr Divakar Jandyam) గార్ల సంయుక్త ప్రాయోజకత్వంలో రెండు మానవీయ కార్యక్రమాలు నిరహించబడ్డాయి.

వాటిలో మొదటిది 110 మంది వరంగల్ వాసులకు కృత్రిమ అవయవాలు (Artificial Limbs) మరియు పాదరక్షల ఉచిత  పంపిణీ కాగా, రెండవది ఉచిత  దంత పరీక్షల (Dental Check-ups) శిబిరం. కృత్రిమ అవయవాల పంపిణీ విషయానికి వస్తే –  2024 నవంబరు లోనే   వైకల్యం ఉన్నవారికి వ్యక్తిగత  పరీక్షలు నిర్వహించి వారి అవసరాలను తెలుసుకుని, ఆ కొలతల మేరకు కృత్రిమ అవయవాలను, పాదరక్షలను జనవరిలో పంపిణీ చేశారు. 

ఇద్దరు ఎన్.ఆర్.ఐ (NRI) ల సంయుక్త ప్రాయోజకత్వానికి తోడుగా శ్రీ రంగారావు గారు,  ఖమ్మం మరియు వరంగల్ క్లబ్ (Warangal Club) సంస్థల వారు ఈ మానవీయ  కార్యక్రమానికి  తమ వంతు చేయూతను అందించటం విశేషం. దీనితో పాటుగా దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ గారు తమ బృందంతో ఉచిత దంత పరీక్షలను (Dental Check-ups) నిర్వహించారు.

ఇందులో వైద్య సూచనల మేరకు అవసరమైన వారికి డెంటల్ కిట్స్ ను ప్రాయోజకులు ఉచితంగా సరఫరా చేశారు. అదే విధంగా ఉచిత వైద్య పరీక్షా శిబిరానికి హాజరైన ప్రతీ ఒక్కరికీ అల్పాహారాన్ని, పండ్లను, మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా సమకూర్చి ప్రాయోజకులు తమ ఔదార్యాన్ని ప్రదర్శించారు.

శ్రీ  ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) గారు, శ్రీ సుమన్ రెడ్డి (Suman Reddy) గారి కుటుంబ సభ్యులు, బంధువుల నేతృత్వం లోని వెంటోలియిస్ బృందం, అదే విధంగా డా. దివాకర్ జంద్యం (Dr Divakar Jandyam) సోదరుడు డా. మధుకర్ (Dr Madhukar) మరియు కరుణ్కర్ జంద్యం (Dr Karunakar Jandyam) గార్లు, ఎందరో స్వచ్చంద కార్యకర్తలు ఈ మహత్తర కార్యక్రమాలు విజయవంతం కావటానికి దోహదం చేశారు.

అమెరికన్ రెడ్ క్రాస్ సొసైటీ (American Red Cross Society) చైర్మన్, ప్రముఖ ఆర్తోపెడిక్ (Orthopedic) వైద్య నిపుణులు డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి (Vijay Chander Reddy) గారు అంగవైకల్యం ఉన్నవారికి వైద్య సలహాలు ఇవ్వటం తో పాటు కృత్రిమ అవయవాల (Artificial Limbs) పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. కృత్రిమ అవయవాలను ధరించిన  వివిధ వ్యక్తులు సంపూర్ణమైన ఆత్మ విశ్వాసాన్ని సంతరించుకుని, తమ జీవితం పట్ల ఆశావహ దృక్పథంతో నడిచిన దృశ్యాలు చూసిన  ప్రతీ ఒక్కరి హృదయం ఆర్ద్రత తో   నిండి, వారి నేత్రాలు చెమర్చడం – ఒక  మరపురాని   సందర్భం.

కృత్రిమ అవయవాల (Artificial Limbs) ఉచిత వితరణ లోను, అదే విధంగా వరంగల్ వాసులకు ఉచిత క్యాన్సర్ & Dental పరీక్షల శిబిరాన్ని  నిర్వహించటం లోను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association – TTA)  ప్రశంసనీయమైన పాత్రను నిర్వహించిందని, ఇది  సంస్థ చరిత్ర లో చెప్పుకోదగ్గ అధ్యాయమని పలువురు ప్రశంసించారు.

హనుమకొండ (Hanamkonda) లో అవసరమైన వారికి కృత్రిమ అవయవాలను (Artificial Limbs) అందించడంపై దృష్టి సారించిన ఒక ముఖ్యమైన పనిని దివాకర్ జంద్యం & సుమన్ రెడ్డి కోట ఇటీవల నిర్వహించారు. ఈ చొరవ మానవతా ప్రయత్నాల పట్ల ఆయన నిబద్ధతను హైలైట్ చేయడమే కాకుండా, జీవితాలను మెరుగుపర్చడంలో సమాజ ఆధారిత ప్రాజెక్టుల శక్తిని కూడా ప్రదర్శిస్తుంది.

అవసరంలో ఉన్నవారికి సేవ చేయాలనే దృక్పథంతో మమ్మల్ని ప్రేరేపించినందుకు మా Telangana American Telugu Association (TTA) వ్యవస్థాపకుడు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి (Dr. Pailla Malla Reddy) గారికి  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. AC చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు, AC సభ్యులు డాక్టర్ మోహన్ రెడ్డి గారు, భరత్ రెడ్డి మాదాడి గారు, అధ్యక్షుడు వంశీ రెడ్డి కంచరకుంట్ల గారు, ఎన్నికైన అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారు, జనరల్ సెక్రటరీ కవితా రెడ్డి గారు EC & BOD లతో పాటు వారి నిరంతర మద్దతుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

error: NRI2NRI.COM copyright content is protected