Connect with us

Government

డెట్రాయిట్లో మోడీకి ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు

Published

on

డెట్రాయిట్, మిచిగాన్, జూన్ 21: అమెరికా పర్యటనకు విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీని స్వాగతిస్తూ ప్రవాస భారతీయులు వెల్‌కం మోడీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. GM Renaissance సెంటర్, డౌన్‌టౌన్ డెట్రాయిట్ లో భారతీయ జెండాలు పట్టుకుని మోడీకి ఇదే మా స్వాగతం అంటూ నినదించారు.

ఈ వెల్‌కం మోడీ (Welcome Modi) కార్యక్రమానికి 150 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. శ్యామ్ ఇనగంటి, రాజేందర్ సందడి, చంద్రు ఆచార్య, హేమ రాచమలే, హరి దేవబత్తిని, వేణు శ్రీదాస్యం, అశోక్ బడ్డి నాయకత్వం ఈ కార్యక్రమానికి వహించారు.

భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపచేస్తున్న మోడీ (Narendra Modi) కి స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు (Indian Americans) ఈ కార్యక్రమంలో ఉత్సాహం చూపించారు. మోడీ మోడీ, భారత్ మాతాకీ జై అంటూ నినదించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected