భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం, టాంపా బే లో ఘనంగా జరిగాయి. టెంపుల్ టెర్రేస్ నగరంలో భారతీయులు ఈ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA), నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ (NATS), మెలోడీ మాక్‌టైల్ సభ్యులు, తెలుగువారు చాలా మంది కలిసి రిపబ్లిక్ డే పరేడ్ విజయవంతం చేసారు.
North America Telugu Society (NATS), Mana American Telugu Association (MATA), Melody Mocktail చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ప్రశంసల వర్షం కురిసింది. చిన్నారుల్లో సృజనాత్మకత పెంచే పోటీలు నిర్వహించారు. నాట్స్ సభ్యులతో పాటు వారి పిల్లలు కూడా ఇందులో భాగస్వాముల అయి రిపబ్లిక్ డే పరేడ్ విజయవంతం చేశారు.
చిన్నారుల్లో సేవాభావాన్ని పెంపొందించడానికి, సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని NATS& MATAనాయకులుసూచనలు చేశారు. రిపబ్లిక్ డే పరేడ్ రోజు వివిధ సంస్థల ఐక్యత ఎంతగానో దోహద పడుతుందని నాట్స్ సంస్థ అభిప్రాయపడింది. నాట్స్ & మాట, మెలోడీ మాక్‌టైల్ వివిధ సంస్థల తో కలిసి భారత జాతీయ జెండా వందనం గావించారు.
ఈ రిపబ్లిక్ డే పరేడ్ (Republic Day Parade) కోసం తమ వంతు సహకారాన్ని అందించిన నాట్స్ మాజీ ఛైర్మన్ & 8వ అమెరికా తెలుగు సంబరాల కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా.కొత్త శేఖరం, బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, బోర్డ్ ఆఫ్ డైరక్టర్ శ్రీనివాస్ మల్లాది తదితరులకు నాట్స్ టాంపా బే విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
నాట్స్ ఫైనాన్స్ / మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్స్ నేషనల్ కోఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహ మండలి సభ్యులు ప్రసాద్ అరికట్ల, సురేష్ బొజ్జ, చాప్టర్ కో ఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కోఆర్డినేటర్ విజయ్ కట్టా, కోఆర్డినేటర్ కమిటీ చైర్స్ కమిటీ శేఖర్ యెనమండ్ర, ప్రసాద్ కొసరాజు, శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, శ్రీనివాస్ బైరెడ్డి, సతీష్ పాలకుర్తి, భరత్ ముద్దన, హరి మండవతో పాటు నాట్స్ వాలంటీర్‌లందరూ చక్కటి ప్రణాళికతో రిపబ్లిక్ డే పరేడ్ విజయవంతం చేశారు.
భావితరంలో సేవాభావాన్ని నింపేందుకు రిపబ్లిక్ డే పరేడ్ చేపట్టి విజయవంతం చేసిన టాంపా బే నాట్స్ విభాగాన్ని నాట్స్ మాజీ ఛైర్ విమెన్ అరుణ గంటి ప్రత్యేకంగా అభినందించారు. సేవే గమ్యం నినాదానికి తగ్గట్టుగా టాంపా బే విభాగం రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించిందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి (Bapu Nuthi) టాంపా బే నాయకులను ప్రశంసించారు.
MATA, NATS, Melody Mocktail ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రిపబ్లిక్ డే వేడుకలకి సహకరించిన, నాట్స్ సెక్రటరీ రంజిత్ చాగంటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ మీడియా సెక్రటరీ మురళి మేడిచెర్లకు కృతజ్ఞతలు తెలిపారు.