హెర్న్డన్ పట్టణంలోని స్థానిక హెర్న్డన్ ఉన్నత పాఠశాల ప్రాంగణం ఈ సంబరాలకు వేదిక కానుంది. ప్రముఖ వెటరన్ గాయకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి పూర్తి చేసుకున్న సందర్భంగా GWTCS వారు ‘ఘంటసాల శతాబ్ది ఉత్సవాలు’ నిర్వహిస్తున్నారు.
అలాగే స్వచ్ఛమైన తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ ఇండియాలో లాగా అరటాకుపై సహపంక్తి భోజనాలను Greater Washington Telugu Cultural Sangam (GWTCS) వారు ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాఫుల్ బహుమతులు, షాపింగ్ స్టాల్ల్స్ ఇలా మరెన్నో ఆహ్వానితులందరినీ ఆకట్టుకోనున్నాయి.
సంక్రాంతి పండుగ సమయంలో మహిళలు అమితంగా ఇష్టపడే ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. పాల్గొనదలచిన వారు విజయ్ అట్లూరి (414-573-9719), శ్రీవిద్య సోమ (703-303-8706), లేదా [email protected] ని సంప్రదించండి. మధ్యాహ్నం 1:30 నుండి 3:30 వరకు నిర్వహించే ఈ ముగ్గుల పోటీలలో గెలిచిన వారికీ గోల్డ్ కాయిన్స్, గిఫ్ట్ కార్డ్స్ బహుకరించనున్నారు.
Krishna Lam GWTCS President
ముగ్గుల పోటీల అనంతరం 4 గంటలకు మెయిన్ కార్యక్రమం మొదలవుతుంది. టికెట్స్ తదితర వివరాలకు పై ఫ్లయర్స్ చూడండి. వర్జీనియా, మేరీలాండ్ మరియు వాషింగ్టన్ డి.సి ప్రాంతాలకు చెందిన తెలుగు వారు అందరూ పాల్గొని GWTCS వారి సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయవలసిందిగా జిడబ్ల్యుటిసిఎస్ కార్యవర్గ సభ్యులు కోరుతున్నారు.