Connect with us

Motivational

అట్లాంటాలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుదేవ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌కు గాంధీ పీస్ పిల్గ్రిమ్ అవార్డ్

Published

on

అట్లాంటా: ప్రపంచవ్యాప్తంగా తన సందేశాల ద్వారా శాంతి స్థాపనకు కృషి చేస్తున్న భారతీయ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ గురుదేవ్ రవిశంకర్‌ (Sri Sri Ravi Shankar) గురువారం, నవంబరు 10న అట్లాంటాలో గాంధీ పీస్‌ పిల్గ్రిమ్ అవార్డును అందుకున్నారు.

మహాత్మ గాంధీ, డా. మార్టిన్ లూధర్ కింగ్ లు ప్రభోదించిన శాంతి, అహింసా సిద్దాంతాల వ్యాప్తికి అలుపెరుగని కృషి చేస్తున్నందుకు గుర్తింపుగా శ్రీ శ్రీ రవిశంకర్ (Founder, Art of Living) ఈ ప్రతిష్టాత్మక ‘గాంధీ పీస్ పిల్గ్రిమ్’ అవార్డుకు ఎంపికయ్యారు.

మానవాళికి విశిష్ట సేవ చేస్తున్నందుకుగాను గాంధీ ఫౌండేషన్‌ ఆఫ్‌ యూఎస్ఎ (Gandhi Foundation of USA) ఆయనకు ఈ గాంధీ పీస్‌ పిల్గ్రిమ్ అవార్డును మార్టిన్ లూథర్ కింగ్ (Martin Luther King Jr.) కేంద్రంలో గల మహాత్మా గాంధి విగ్రహం ముందు ప్రధానం చేసింది.

డాక్టర్‌ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ మేనల్లుడు ఐసాక్‌ ఫెర్రిస్‌, భారత కాన్సుల్‌ జనరల్‌ డాక్టర్‌ స్వాతి కులకర్ణి, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కమ్యునిటి సమక్షంలో గాంధీ ఫౌండేషన్ అధ్యక్షులు సుభాష్ రాజదాన్, కార్యవర్గ సభ్యులు ఆంటోనీ తలియాత్, రవి పోణంగిల నుండి శ్రీ శ్రీ రవి శంకర్ ఈ అవార్డును అందుకున్నారు.

గతంలో దలైలామా, అమెరికా అద్యక్షులు జిమ్మి కార్టర్, కరొట్టా స్కాట్ కింగ్, దాదా సాధు వాస్వాని గాంధీ పీస్‌ పిల్‌గ్రిమ్‌ అవార్డును అందుకున్నారు. అవార్డ్ ప్రధానంతరం, రవిశంకర్ మహాత్మ గాంధీ విగ్రహం నుండి మార్టిన్ లూధర్ కింగ్, కొరట్ట స్కాట్ కింగ్ సమాధుల వరకు శాంతి యాత్రను సాగించటాన్ని విశేషంగా చెప్పవచ్చు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected