ఒక వ్యభిచార ముఠాని జనవరి 19న టెక్సస్ (Texas) రాష్ట్రంలోని డల్లాస్ (Dallas) నగరంలో పోలీసులు అరెస్టు చేశారు. నార్త్వెస్ట్ డల్లాస్ లోని మార్ష్ లేన్ కి దగ్గిరలో ఉన్న నైబర్హుడ్ లో ఒక ఇంటిని స్వల్పకాల పరిమితికి అద్దెకు తీసుకొని గుట్టుగా వ్యభిచారం నడుపుతున్న ముఠాని 4 నెలల విచారణ అనంతరం 23 మందిని అరెస్టు చేశారు. అసలు రింగ్ లీడర్స్ పరారీలో ఉన్నారు. రాబోయే రోజుల్లో మరింత మందిని అరెస్టు చేస్తామన్నారు పోలీసులు.
సెప్టెంబర్ లో ఆ నైబర్హుడ్ లో అనుమానాస్పదంగా వస్తూ పోతూ ఉన్న వారిపై అక్కడ ఉంటున్న కొందరు స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డల్లాస్ పోలీసులు విచారణ చేపట్టారు. దీర్ఘ విచారణ అనంతరం నిన్న గురువారం 23 మందిని అరెస్టు చేశామని డల్లాస్ పోలీస్ సూపరింటెండెంట్ వారెన్ (Warren) చెప్పారు. పోలీస్ రిపోర్ట్స్ ప్రకారం $350 నుండి $1100 వరకు విటుల నుండి ఈ ముఠా వసూలు చేసినట్లు తెలిసింది.
ప్లానో (Plano) పట్టణంలో కూడా వీరి కార్యకలాపాలు సాగుతున్నట్లు, ఆన్లైన్ వెబ్సైట్స్ ద్వారా ఈ నిర్వాకం సాగిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ 23 మంది అనుమానితుల జాబితాలో 27 నుండి 70 సంవత్సరాల వయస్సు వున్న పురుషులు ఉన్నారు. ఇందులో ఇండియా నుండి వచ్చిన పశ్చిమ బెంగాల్ వాసి డిబ్యదు ముఖర్జీ మరియు తెలుగు వాసి రామ్ యార్లగడ్డ ఉన్నట్లు తెలిసింది.