హైదరాబాద్, బంజారాహిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వద్ద నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చేతన ఫౌండేషన్ అనే లాభాపేక్ష లేని సంస్థ సహాయ సహకారాలతో అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లో స్థిరపడిన గుంటూరు జిల్లా వాసి రాంచౌదరి ఉప్పుటూరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది.
రామ్ చౌదరి తానా తదితర సంస్థల్లోని తన స్నేహితులతో సమన్వయపరిచి ఫండ్స్ సేకరించి ఈ నిత్య అన్నదాన కార్యక్రమం ద్వారా తమ ఉదారతను చాటుకుంటున్నారు. కొన్ని నెలలుగా ప్రతి రోజూ, రైన్ ఆర్ షైన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆరుబయట చెట్ల కింద అయినాసరే నిర్విఘ్నంగా నడిపిస్తున్నారు.
ఆసుపత్రిలో తమ వారిని క్యాన్సర్ సంబంధిత వ్యాధుల చికిత్స కొరకు చేర్పించడం, ఆసుపత్రిలో పేషెంట్ తోపాటు ఎక్కువమందిని ఉండనివ్వని కారణాల రీత్యా బయట అటువంటి వారికోసం ఈ నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
ఎవరైనా ఈ సేవాకార్యక్రమంలో సహాయపడదలచుకుంటే రాంచౌదరి ఉప్పుటూరి లేదా చేతన ఫౌండేషన్ వారిని సంప్రదించండి. హైదరాబాద్ లోనిబసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి నందమూరి బాలక్రిష్ణ చైర్మన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.