ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ రెండో దశ విజృంభిస్తుందేమోనన్న భయం నెలకొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నో మాస్క్ నో ఎంట్రీ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు 15 రోజులపాటు అంటే ఏప్రిల్ 7 వరకూ సాగుతుంది. మాస్కు ధరించని వారి నుంచి రూ.1000 జరిమానా వసూ లు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నడపాలని నిర్ణయించారు.