చికాగో ఆంధ్ర సంఘం (CAA) సాంస్కృతికోత్సవ వేడుకలు నవంబర్ 4 వ తేదీన, ఓస్వెగొ ఈస్ట్ హైస్కూల్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.చైర్మన్ సుజాత అప్పలనేని, అధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి గారి నేతృత్వంలో, ఉపాధ్యక్షులు శ్వేత కొత్తపల్లి సహకారంతో, సంఘ వ్యవస్థాపకులు ఉమా కటికి, రాఘవ్ జాట్ల, సుందర్ దిట్టకవి, శ్రీనివాస్ పెదమల్లు, పవిత్ర కారుమూరి, భార్గవి నెట్టెం, పద్మారావు అప్పలనేని, పాస్ట్ ప్రెసిడెంట్స్ మాలతీ దామరాజు, శైలేష్ మద్ది గార్ల సమక్షం లో జరిగిన ఈ కార్యక్రమానికి 800 మందికి పైగా విచ్చేసి వీక్షించారు.
చికాగో (Chicago) తెలుగు వారందరూ వయసుతో నిమిత్తం లేకుండా ఆనందోత్సాహాలతో కలసి ఈ వేడుకలను జరుపుకున్నారు. అనురాధ గంపాల, ప్రభాకర్ మల్లంపల్లి గారి ఆధ్వర్యంలో హేమంత్ తలపనేని, మురళి రెడ్డివారి, శ్రీకృష్ణ మతుకుమల్లి, నరసింహారావు వీరపనేని మున్నగు ఎంతోమంది సభ్యత్వ నమోదు, రెజిస్ట్రేషన్ ఉత్సాహంగా నిర్వహించారు. మురళీ రెడ్డి వారి వెబ్ రెజిస్ట్రేషన్, క్యూఆర్ కోడ్ అందించి కార్యక్రమం సాఫీగా సాగేలా తోడ్పడ్డారు. త్వరలో CAA (Chicago Andhra Association) యాప్ నివిడుదలచేయబోతు న్నామని ప్రకటించారు. అధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి మరియు ట్రెజరర్ ప్రభాకర్ మల్లంపల్లి వార్షిక జెనెరల్ మీటింగ్ ను నిర్వహించారు.
దీప ప్రజ్వలన, ప్రార్ధనా గీతాలతో మొదలయి, తరువాత నాణ్యత, నవ్యత, వినోదం కలగలసిన ఎన్నో మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకున్నాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఆనందోత్సాహాలతో దసరా, దీపావళి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గోన్నారు. సౌజన్య రాళ్ళబండి, రవి తోకల, సుందర్ దిట్టకవి, సిరిప్రియ బచ్చు, శ్రీయ కొంచాడ, మరియు నిధి గాలి ఆద్యంతం జనరంజకంగా, సమయోచితంగా వ్యాఖ్యానాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ విరాళాలతో సంస్థ అభ్యున్నతిని ఎంతో ప్రోత్సహిస్తున్న స్పాన్సర్ల ను, గౌరీశంకర్ అద్దంకి, శ్వేత కొత్తపల్లి, వేదిక పైకి ఆహ్వానించి కృతజ్ఞతలు తెలిపి పూలగుచ్చాలతో సత్కరించారు.
మన సంస్కృతిని తెలిపే అద్భుతమైన కుచిపూడి, భరతనాట్యం నృత్యప్రదర్శనలు కన్నులవిందు చేసాయి.రాధికా గరిమెళ్ళ ఆధ్వర్యంలో, 35కు పైగా చికాగో ఆంధ్ర సంఘం టీం కలిసి “సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి” హృదయపూర్వక నివాళినర్పించారు. ఆయన రాసిన ఎన్నో ఆణిముత్యాల లాంటి పాటలను స్మరించుకుంటూ చేసిన గాన, నృత్య ప్రదర్శన ప్రధానాకర్షణగా నిలిచింది. కేవలం సినీపరిశ్రమనే కాకుండా యావత్ తెలుగు ప్రపంచాన్ని తన రచనల ద్వారా సిరివెన్నెలగారు ఆలోచింపచేసి ప్రభావితం చేసారు. ఆయనకి స్మృత్యంజలి ఈ ప్రోగ్రాం ముఖ్యోద్దేశం.
ఈనాటి సాంస్కృతిక కార్యక్రమాలను కల్చరల్ టీం అనూష బెస్త, సౌజన్య రాళ్ళబండి, హరిణి మేడ, అద్భుతంగా సమన్వయించగా, శ్రీనివాస పద్యాల, శిల్పా రామిశెట్టి, మరియు శైలజ సప్ప సహకరాన్నందించారు. టీం 2023 ధమకా అనే అద్భుతమైన డాన్స్ తో సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టెర్లు, అధ్యక్షులు, సంఘ వ్వస్థాపకులు, మున్నగువారు ప్రేక్షకులని అలరించారు.2024-25 సంవత్సరానికి చైర్మన్ గా శ్రీనివాస్ పెదమల్లు గారు, 2024 సంవత్సరానికి వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకృష్ణ మటుకుమల్లి గారు బాధ్యతలు స్వీకరించనున్న సందర్భం లో అందరూ వారికి అభినందనలు తెలియ చేసారు.
అధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి తన అధ్యక్షతన, టీం 2023 సాధించిన విజయాలను వివరించారు.2024 సంస్థ యొక్క సేవావిభాగమైన చికాగో ఆంధ్ర ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను, మును ముందు చేపడుతున్న ప్రాజెక్ట్ లను సవితా మునగ మరియు సుచిత్ర తెల్లాప్రగడ వివరించారు.సురేష్ కుమార్ ఐనపూడి, ఆధ్వర్యంలో “గోల్కొండ రెస్టారెంట్’ వారు రుచికరంగా తయారుచేసిన “ఆంధ్రా విందు భోజనాన్ని” విజయ్ కొర్రపాటి, విజయ్ దెండుకూరిమురళి రెడ్డివారి, గిరిరావు కొత్తమసు, రామారావు కొత్తమసు, శ్రీనివాస్ పెదమల్లుభార్గవి నెట్టెం, శైలేష్ మద్ది, ట్రస్టీలు, యువజన విభాగ సభ్యులు, ఎంతోమంది వాలంటీర్లు కొసరి కొసరి వడ్డించారు.
గిరిరావు కొత్తమాసు, రామరావు కొత్తమాసు కార్యక్రమo సాఫీగా సాగడానికి ఎంతో కృషి చేసారు. లక్ష్మీనాగ్ సూరిభొట్ల గారు తమ హాస్యస్ఫోరకమైన పెళ్ళిసంద ఢీ ఢీ.. నాటికతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించారు. CAA యువజన విభాగం సేవలతో కార్యక్రమం జయప్రదం అయ్యేలా చేశారు. కాస్మోస్ డిజిటల్ సూర్య దట్ల ఈ కార్యక్రమానికి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలనందించారు. టీం 2023 లో సేవలందించిన సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టెర్లను అధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి సత్కరించారు.
శ్వేత కొత్తపల్లి, టీం 2024 ను వేదికపై పరిచయం చేసారు. Chicago Andhra Association అధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి తన కృతజ్ఞతలను తెలుపగా, రామరావు కొత్తమాసు వందన సమర్పణ చేసారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ట్రస్టీలు, గౌరీశంకర్ అద్దంకి గారి నేతృత్వంలో డైరెక్టర్లు, మరియు ఎంతోమంది వాలంటీర్లు శ్రమించారు. అమెరికా, భారత దేశాల జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం సుసంపన్నమయింది.