నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి రోజూ మీడియాలో చూస్తున్నాం. ఇందులో భాగంగా అమెరికాలోని నార్త్ కెరొలినా రాష్ట్రం (North Carolina), ర్యాలీ నగరంలో కూడా చంద్రబాబు (Nara Chandrababu Naidu) కి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.
ర్యాలీ (Raleigh) నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడి అరెస్టుని ఖండిస్తూ కాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సుమారు 250 మంది ప్రవాసులు పాల్గొని తమ గళాన్ని వినిపించారు. మహిళలు, పిల్లలు, పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబుకి సంఘీభావం తెలిపారు.
రామ్ అల్లు, వంశి బొట్టు, రాజేష్ యార్లగడ్డ ఆధ్వర్యంలో కుమార్ చల్లగొల్ల, మూర్తి అక్కిన, మిథున్ సుంకర, కేశవ్ వేముల, సిద్ద కోనంకి, కిరణ్ చిలుకూరి, శ్రీపాద కాసు, ప్రవీణ్ తాతినేని, రమేష్ తుమ్మలపల్లి, శశి చదలవాడ, శిరీష్ గొట్టిముక్కల, రవి కిషోర్ లాము, సురేష్ వెల్లంకి, వినోద్ కె, గిరి నర్రా, వీరయ్య చౌదరి, చందు, వెంకట్ కోగంటి, శ్రీనివాస్ సుంకర, మురళి మర్ని, రవి దర్శి, భాను వేమూరి, నరేష్ కొసరాజు, కళ్యాణ్ మద్దిపాటి సహాయసహకారంతో ఈ కాండిల్ లైట్ ర్యాలీ (Candlelight Rally) కార్యక్రమాన్ని నిర్వహించారు.
బాబుతో నేను, ఉయ్ స్టాండ్ విత్ సీబీఎన్ (We Stand With CBN) ప్లకార్డులు ప్రదర్శించారు. తెలుగుదేశం (Telugu Desam Party) జెండాలు, బ్యానర్లు పట్టుకొని మేము సైతం బాబు కోసం అంటూ నినదించారు. చీకట్లో సైతం కొవ్వొత్తులతో శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. సేవ్ డెమోక్రసీ.. సేవ్ ఆంధ్రప్రదేశ్, సైకో పోవాలి.. సైకిల్ రావాలి, ఉయ్ వాంట్ జస్టిస్ (We Want Justice) అంటూ నినాదాలు చేశారు.
శాంతి చిహ్నానికి దూత అయినటువంటి మహాత్మాగాంధీ (Mahatma Gandhi) జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2 సోమవారం సాయంత్రం నిర్వహించిన ఈ కాండిల్ లైట్ ర్యాలీ అందరినీ ఆలోచింపజేసింది. తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని తెలుగువారు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.