Connect with us

Eye Camp

మానవత్వం చాటిన నాట్స్ అధ్యక్షులు బాపు నూతి, 570 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు

Published

on

భాషే రమ్యం,సేవే గమ్యం అనేది నాట్స్ నినాదం. ఆ నినాదానికి తగ్గట్టుగా నాట్స్ అధ్యక్షులు బాపు నూతి ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ అధ్యక్ష బాధ్యతలు బాపు నూతి చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇటీవలే గుంటూరు జిల్లా పెదనందిపాడులో మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయించి వేల మంది పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించారు. ఈ వైద్య శిబిరంలో 570 మంది పేదలకు కంటి శస్త్ర చికిత్సలు అవసరమని వైద్యులు తేల్చారు. ఆ 570 మంది పేదలకు శస్త్ర చికిత్సలకు అయ్యే ఖర్చును భరిస్తానని బాపు నూతి మాటిచ్చారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ 570 మంది పేదలను బస్సులో శంకర కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించి బాపు నూతి తన మానవత్వాన్ని చాటుకున్నారు. బాపు నూతి చూపిన దాతృత్వానికి ఆపరేషన్లు చేయించుకున్న పేదలు బాపు నూతి సేవాగుణంపై మరియు నాట్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected