Connect with us

Politics

Atlanta: జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు బొమ్మిడి నాయకర్ తో మీట్ & గ్రీట్

Published

on

అట్లాంటా, అక్టోబర్ 15, 2023: జనసేన – టిడిపి సమన్వయ కమిటీ సభ్యులు బొమ్మిడి నాయకర్ (Bommidi Nayakar) మరియు సోదరులు సునీల్ నాయికర్ అమెరిక పర్యటనలో భాగంగా అట్లాంటా (Atlanta) రావడం జరిగింది. వారి రాకను పురస్కరించుకొని “టీం అట్లాంట జనసేన” నేడు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించింది.

అట్లాంటా కోర్ జనసేన సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని, సునీల్ గారిని సత్కరించడం జరిగింది. అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్తితులపై చర్చ జరిగింది. వైసిపి అరాచకపు పాలనకు ముగింపు పలకాలని జనసేన అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రభుత్వ వ్యతిరేక ఓట్ చీలకోడదు అని ప్రదాన ప్రతిపక్షం టిడిపి (Telugu Desam Party) తో కలిసి ప్రయాణించడం పై హర్షం వ్యక్తంచేసారు.

అప్పులాంధ్రప్రదేశ్ నుండి అన్నపూర్ణాంధ్రప్రదేశ్ గా రాష్ఠం మారాలి అంటే వైసిపి (YSR Congress Party) పోవాలి అని అట్లాంటా (Atlanta) జనసేన కోర్ టీం సభ్యులు నినదించారు. ఈ సమావేశంలో టీం అట్లాంట జనసేన (Jana Sena Party) తీసుకొన్న కొన్ని నిర్ణయాలు NRI2NRI.COM మీ కోసం అందిస్తోంది.

  1. సోషల్ మిడియాలో జనసేన భావజాలాన్ని, జనసేన మానిఫెస్టో ని చేరువైయ్యేలా పని చెయ్యాలి.
  2. ప్రతి సభ్యుడు స్వదేశంలో తన కుటుంబ సభ్యులు మరియు మిత్ర బృందాలతో జనసేన సిద్దాంతాలపై వివరణాత్మక విశ్లేషణలు చేస్తూ, జనసేనపై నమ్మకాన్ని పెంపొందించాలి.
  3. స్వగ్రామంలో జరిగే జనసేన పార్టి కార్యక్రమాలపై తమ సహాయాన్ని అందించాలి.
  4. వాట్సాప్ లో కంటే వాడ వాడలా జనసేన విస్తరణకై పాటుపడాలి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected