Connect with us

Government

San Francisco Indian Consulate General గా శ్రీకర్‌ రెడ్డి; ఆటా నాయకుల కలయిక

Published

on

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, ట్రస్ట్ బోర్ద్ సభ్యులు రిండ సామ మరియు కమ్యునిటి లీడర్ వినోద్ నాగి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నూతన కాన్సులేట్‌ జనరల్‌గా నియమితులైన డాక్టర్‌ శ్రీకర్‌ కె రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియచేశారు.

ఆటా (American Telugu Association) ఉపాధ్యక్షులు జయంత్ చల్లా సంస్థ సేవా కార్యక్రమాలను, డిసెంబర్ లో జరిగే ఆటా వేడుకలు వివరించి, జూన్ లో జార్జియా వర్ల్డ్ కాంగ్రెస్ సెంటర్, అట్లాంటా లో జరిగే ఆటా 18 వ కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ కి ఆహ్వానించారు.

యాదాద్రి జిల్లాలోని మోత్కూరు మండలంలోని కొండగడప గ్రామంలో జన్మించిన డాక్టర్‌ శ్రీకర్‌ కె రెడ్డి 1996 లో కాకతీయ వర్సిటీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. అనంతరం ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికై తన బ్యాచ్‌లోనే సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.

జర్మనీ (Germany) లోని బెర్లిన్‌ (Berlin) లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో పనిచేసిన ఆయన దిల్లీలోని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోనూ సేవలందించారు. గతంలో కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా పనిచేసిన డాక్టర్‌ టి.వి. నాగేంద్ర ప్రసాద్ తర్వాత మరో తెలుగు వ్యక్తి ఆ పదవి చేపట్టడం తెలుగువారికి గర్వకారణం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected