Connect with us

Conference

Daaji Heartfulness, త్రీరీ బ్యాండ్ కాన్సర్ట్ తో హోరెత్తిన ATA ద్వైవార్షిక సభల 2వ రోజు @ Georgia World Congress Center

Published

on

నవత, యువత, భవిత థీమ్ తో మొదలైన ఆటా 18వ ద్వైవార్షిక మహాసభలు రెండవ రోజు కూడా ఆకట్టుకున్నాయి. ఉదయాన్నే ఆటా (ATA) నాయకులు ఊరేగింపుగా కన్వెన్షన్ ఇనాగరల్ (Inaugural) కి విచ్చేశారు. ముఖ్య అతిథి హార్ట్ఫుల్నెస్ దాజి (Kamlesh D. Patel) జ్యోతి ప్రజ్వలన గావించారు. ఆటా కన్వెన్షన్ మొదటి రోజు కవరేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని మరియు కన్వెన్షన్ కన్వీనర్ కిరణ్ పాశం అందరికీ సాదర ఆహ్వానం పలుకుతూ కాసేపు ప్రసంగించారు. వేద పండితులు ఆటా (American Telugu Association) నాయకులను వేద వచనాల నడుమ ఆశీర్వదించారు. ఇనాగరల్ డాన్స్ బ్యాలట్ అందరినీ ఆకట్టుకుంది.

స్థానిక అమెరికన్ (American) రాజకీయ నాయకులను, ప్రభుత్వ ప్రతినిధులను, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (Consulate General of India – Atlanta) వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానించి శాలువా, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. కన్వెన్షన్ హాల్ అంతా చక్కని అలంకరణలతో ముస్తాబు చేయడం విశేషం.

కన్వెన్షన్ మెయిన్ స్టేజీపై క్లాసికల్, వెస్ట్రన్, సినిమా డాన్సులు, పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) సాగుతుండగా, వివిధ బ్రేకౌట్ రూమ్స్ లో పలు కార్యక్రమాలు (Breakout Sessions) ఏర్పాటు చేశారు. అలాగే దాతలకు, హాజరైనవారికి సెపరేట్ గా భోజనాలు ఏర్పాటుచేశారు.

హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ (Heartfulness Meditation) విత్ దాజి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఝుమ్మంది నాదం ఫైనల్స్, సయ్యంది పాదం ఫైనల్స్, బ్యూటీ పాజెంట్ ఫైనల్స్, పొలిటికల్ ఫోరమ్, మహిళా ఫోరమ్, సాహితీ సదస్సు, బిజినెస్ ఫోరమ్, ఇమ్మిగ్రేషన్, టాక్సేషన్, పూర్వ విద్యార్థుల సమావేశాలు, వివాహ పరిచయ వేదిక వంటివి బ్రేకౌట్ రూమ్స్ లో నిర్వహించారు.

రోజంతా తెలుగువారు షాపింగ్ బూత్స్ (Shopping Exhibits) దగ్గిర కలియతిరుగుతూ ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ కార్యక్రమాలతో ప్రోగ్రాం షెడ్యూల్ టైట్ గా నడిచింది. కొంచెం బ్రేక్ అనంతరం సాయంత్రం మెయిన్ స్టేజీపై కల్చరల్ ప్రోగ్రామ్స్ (Cultural Programs) తో తిరిగి ప్రారంభించారు.

ప్రైమ్ టైం లో తెలంగాణ (Telangana) రాష్ట్ర సినిమా శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలుగు సినీ (Tollywood) నటులు శ్రీకాంత్, ఆటా పాస్ట్ ప్రెసిడెంట్స్, ప్లాటినం స్పాన్సర్స్ తదితరులను ఆటా నాయకులు ఘనంగా సన్మానించారు.

అనంతరం ముఖ్య అతిథి, ఇండియా నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన హార్ట్ఫుల్నెస్ దాజి (Daaji Kamlesh D. Patel) ని కన్వెన్షన్ కన్వీనర్ కిరణ్ పాశం సారధ్యంలో ఆటా నాయకులు వేదిక మీదకు సాదరంగా తోడ్కొని రాగా, సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

జాతీయ అవార్డు గ్రహీత, సినీ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు (Archana Rao) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెషనల్ ఫ్యాషన్ షో అందరి మన్ననలు పొందింది. ఈ ఫ్యాషన్ షో లో స్థానిక యువతీయువకులతోపాటు టాలీవుడ్ తారలు మెహ్రీన్ (Mehreen), నేహా శెట్టి (Neha Shetty) పాల్గొనడంతో మరింత గ్లామర్ తోడయినట్లయింది.

యాంకర్స్ శ్రీముఖి (Anchor Sreemukhi) మరియు రవళి (Ravali) కార్యక్రమం ఆసాంతం చక్కని వాక్చాతుర్యంతో అందరినీ అలరించారు. చివరిగా హైదరాబాద్ లో పాపులర్ మ్యూజికల్ బ్యాండ్ త్రీరీ బ్యాండ్ (Threeory Band) వారు లైవ్ కాన్సర్ట్ లో ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యంగా యువతను ఆకర్షించే పాటలతో వేదిక ప్రాంగణాన్ని హోరెత్తించారు.

ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని నాయకత్వంలో కిరణ్ పాశం (Kiran Pasham) కాన్ఫరెన్స్ కన్వీనర్ గా, శ్రీధర్ తిరుపతి కోఆర్డినేటర్ గా, సాయి సుధిని నేషనల్ కోఆర్డినేటర్ గా, అనీల్ బొద్దిరెడ్డి డైరెక్టర్ గా, ప్రశాంతి అసిరెడ్డి కోకన్వీనర్ గా, ప్రషీల్ గూకంటి కోకోఆర్డినేటర్ గా, శ్రీనివాస్ శ్రీరామ కోడైరెక్టర్ గా, ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (ATA Board of Trustees) సహకారంతో 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు.

18వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ రెండవ రోజుకి సంబంధించి మరిన్ని ఫోటోల కొరకు www.NRI2NRI.com/ATA 18th Convention & Youth Conference Day 2 in Atlanta ని సందర్శించండి. మిగతా కార్యక్రమాల వివరాల కోసం www.NRI2NRI.com/ATA 18th Convention Program Guide ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected