Connect with us

Government

Washington DC: Andhra Pradesh హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ ఉన్నం మురళీధరరావు కి సన్మానం

Published

on

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ ఉన్నం మురళీధరరావు కి అమెరికా పర్యటనలో జులై 28, ఆదివారం రోజున వాషింగ్టన్ డీసీ లో ప్రవాసులు సత్కరించారు. గత ప్రభుత్వ శాసనాలను అప్రజాస్వామికంగా తోసిపుచ్చి, వేలాది మంది రైతుల కుటుంబాలను, వారి స్వచ్ఛంద ఘనతను మరచి, అప్పటి వైసీపీ (YSR Congress Party) ప్రభుత్వం రాజధాని అమరావతి (Amaravati) ని విశాఖపట్నం తరలించాలి అని సంకల్పించినప్పుడు, హైకోర్టు (High Court) లో కేసులు వాదించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై స్టే ఆర్డర్ తీసుకురావడానికి మురళీధరరావు విశేష కృషి చేశారు.

ఈ సందర్భంగా ఐదు సంవత్సరాల పాటు మూడు ముక్కలాట ఆడిన దుర్మార్గ పాలకులకు, చేసిన దురాగతాలకు.. న్యాయస్థానం సాక్షిగా పోరాడి అండగా నిలిచిన న్యాయవాది ఉన్నం మురళీధరరావు (Unnam Muralidhar Rao) కి రాజధాని ప్రాంత రైతుల, రాష్ట్ర ప్రగతిని కాంక్షించే ప్రవాసులందరి తరపునా శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected