Connect with us

Elections

ఆటాలో ఎన్నికల హోరు, మోగిన ఎన్నికల నగరా! తదుపరి అధ్యక్షులెవరు?

Published

on

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ గత జులై నెలలో 17వ మహాసభలను అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. తదనంతర పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికల హోరు నడుస్తుంది. ఎన్నికల నగరా మోగడంతో ఆటా చరిత్రలో అతిపెద్ద ఎలక్షన్ కి తెర లేచింది.

వివరాలలోకి వెళితే… ఆటా (ATA) లో ప్యాట్రన్, గ్రాండ్ ప్యాట్రన్ మరియు లైఫ్ కేటగిరీ అని మూడు రకాల బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తో మొత్తం 31 మంది ఉంటారు. ఆటా సభ్యత్వం ఉన్నవారు ఈ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ని వోట్ ద్వారా ఎన్నుకుంటారు. అనంతరం ఈ 31 మంది సింపుల్ మెజారిటీ తో ఆటా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 16 లేదా 15 మంది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (Board of Trustees) ని 4 సంవత్సరాల పదవీ కాలానికి ఎన్నుకుంటారు. అంటే ఈ ప్రాసెస్ అంతా ఇండియాలో సాధారణ ఓటర్లు ఒక రాష్ట్ర ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే, అనంతరం ఆ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకున్నట్టన్నమాట.

Sample Ballot – Life

ఈ ఆటా ఎన్నికల్లో ప్యాట్రన్ (Patron) కేటగిరీలో 3, గ్రాండ్ ప్యాట్రన్ (Grand Patron) కేటగిరీలో 3 మరియు లైఫ్ (Life) కేటగిరీలో 10 బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్యాట్రన్ కేటగిరీలో దాదాపు 500 ఓటర్లు, గ్రాండ్ ప్యాట్రన్ కేటగిరీలో సుమారు 200 ఓటర్లు మరియు లైఫ్ కేటగిరీలో సుమారు 12 వేల ఓటర్ల వరకు ఉన్నట్లు సమాచారం.

లైఫ్ కేటగిరీలో 10 పదవులకు 16 నామినేషన్స్, ప్యాట్రన్ కేటగిరీలో 3 పదవులకు 6 నామినేషన్స్ మరియు గ్రాండ్ ప్యాట్రన్ కేటగిరీలో 3 పదవులకు 5 నామినేషన్స్ రావడం, కొందరిని పోటీ నుంచి విరమింపజేసి ఏకాభిప్రాయానికి వచ్చేలా నామినేషన్ కమిటీ (Nomination Committee) చేయలేకపోవడంతో కొంతమంది పోటీదారులను స్లేట్ రికమెండెడ్ అభ్యర్థులుగా సిఫార్సు చేస్తూ ఎలక్షన్ (Election Committee) కమిటీకి పంపింది.

Sample Ballot – Patron

ఆటాలో ఇప్పటికి రెండు సార్లు ఎలక్షన్స్ (Elections) జరగగా, కొవిడ్ (COVID) టైం లో జరిగిన గత ఎలక్షన్ ని పక్కన పెడితే ప్రస్తుత ఎలక్షన్ 30 సంవత్సరాల ఆటా చరిత్ర (ATA History) లోనే అతి పెద్ద ఎలక్షన్ అంటున్నారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని తెలుగువారు.

ముందుగా ఎలక్ట్రానిక్ వోటింగ్ (Electronic Voting) అనుకున్నప్పటికీ ఎలక్షన్ సాఫ్ట్వేర్ ఆటా రాజ్యాంగానికి (Constitution) అనుగుణంగా పనిచేసేలా లేకపోవడంతో ఎప్పటిలానే పేపర్ బ్యాలెట్స్ వైపు మొగ్గారు. ఎలక్షన్ కమిటీ డిసెంబర్ 15న ఆటా సభ్యులందరికీ బ్యాలెట్స్ పోస్ట్ చేసింది. అందరూ వోట్ వేసి ప్రీపెయిడ్ ఎన్వలప్ ద్వారా 2023 జనవరి 6 లోపు తిరిగి పంపించాలి.

Sample Ballot – Grand Patron

అదే రోజు రాత్రి లేదా తెల్లారి 2023 జనవరి 7న కౌంటింగ్ పూర్తి చేసి విజేతలను ప్రకటిస్తారు. అలాగే 2023 జనవరి 21న లాస్వేగాస్ లో నిర్వహించే ఆటా బోర్డు మీటింగ్లో (Board Meeting) ఆటా తదుపరి అధ్యక్షులు (President) మరియు కార్యవర్గం ప్రమాణస్వీకారం చేస్తారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఆటా కి కాబోయే తదుపరి అధ్యక్షులెవరు వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇంకో 15 రోజులు ఆగాల్సిందే.

మరిన్ని వివరాలకు ఈ క్రింది ఆటా (American Telugu Association – ATA) వెబ్సైట్ లింక్స్ ని సందర్శించి మెరుగైన అభ్యర్థులను ఎన్నుకొని ఆటా సంస్థ ఔన్నత్యాన్ని పెంచవలసిందిగా కోరుతున్నారు అమెరికాలోని తెలుగువారు.

ATA Bylaws

ATA Constitution

ATA Eletions

ATA Services

Election Candidates

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected