Connect with us

Elections

ఆటాలో ముగిసిన అతిపెద్ద ఎలక్షన్స్, గెలుపు గుర్రాల వివరాలు ఇవిగో!

Published

on

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) లో ఎన్నికల హోరు గురించి రెండు వారాల క్రితం NRI2NRI.COM మీ ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆటా చరిత్రలో ముగిసిన అతిపెద్ద ఎలక్షన్స్ మరియు గెలుపు గుర్రాల వివరాలు ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్నాం.

ఈ అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ ఎన్నికల్లో 2023-26 కాలానికి లైఫ్ కేటగిరీలో 10, ప్యాట్రన్ కేటగిరీలో 3 మరియు గ్రాండ్ ప్యాట్రన్ కేటగిరీలో 3 కలిపి మొత్తం 16 బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఎలక్షన్ కమిటీ 2022 డిసెంబర్ 15న ఆటా సభ్యులందరికీ బ్యాలెట్స్ పోస్ట్ చేసింది. వోట్ వేసిన వారు ప్రీపెయిడ్ ఎన్వలప్ ద్వారా 2023 జనవరి 6 లోపు తిరిగి పంపించారు.

ప్యాట్రన్ కేటగిరీలో దాదాపు 500 ఓటర్లు, గ్రాండ్ ప్యాట్రన్ కేటగిరీలో సుమారు 200 ఓటర్లు మరియు లైఫ్ కేటగిరీలో సుమారు 12 వేల ఓటర్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో తెలియాల్సి ఉంది. జనవరి 7న కౌంటింగ్ పూర్తి చేసి విజేతలను ప్రకటించారు.

లైఫ్ కేటగిరీలో 10 కి 10 స్లేట్ అభ్యర్థులు గెలుపొందగా, ప్యాట్రన్ మరియు గ్రాండ్ ప్యాట్రన్ కేటగిరీలలో మిక్స్డ్ స్లేట్ అభ్యర్థులు గెలుపొందారు. కొంచెం అటుఇటుగా అందరూ 100 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు తెలిసింది. జనవరి 21న లాస్వేగాస్ లో నిర్వహించే ఆటా బోర్డు మీటింగ్లో ఆటా తదుపరి అధ్యక్షులను ఎన్నుకుంటారు. దీనిపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

లైఫ్ కేటగిరీలో విజేతల వివరాలు:-

Anil Boddireddy, Atlanta
Chinna Reddy (Sunny Reddy), Detroit
Kiran Pasham, Atlanta
Kishore Guduru, Nashville
Maheedhar Muskula, Chicago
Narsi Reddy Gaddikoppula, Austin
Ramakrishna Reddy Ala, Nashville
Raju Kakkerla, Philadelphia
Sai Sudhini, Raleigh
Srikanth Gudipati, New Jersey

ప్యాట్రన్ కేటగిరీలో విజేతల వివరాలు:-

Narasimha Reddy Dhyasani, Los Angeles
Raghuveer Maripeddi, Dallas
Sainath Boyapalli, Chicago

గ్రాండ్ ప్యాట్రన్ కేటగిరీలో విజేతల వివరాలు:-

Satish Reddy, Dallas
Srinivas Dargula, New Jersey
Vinod Reddy Koduru, New Jersey

మరిన్ని వివరాలకు www.NRI2NRI.com/ATAElections ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected