Connect with us

Community Service

Adopt A Highway: Florida హైవే క్లీనింగ్‌లో నాట్స్‌తో స్థానికులు, ఆపై ప్రశంసలు – Tampa Bay

Published

on

నాట్స్ సేవా కార్యక్రమాలలో వేసిన ముందడుగు ఎందరికో స్ఫూర్తిగా మారుతుంది. అమెరికాలో రహదారుల పరిరక్షణ, పచ్చదనం, పరిశుభ్రత కూడా ప్రజలు తమ సామాజిక బాధ్యతగా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ టాంపా బే విభాగం టాంపా లోని రెండు మైళ్ల హైవేను దత్తత (Adopt A Highway) తీసుకుంది.

ఈ రెండు మైళ్ల పరిధిలో ఉండే హైవేను శుభ్రం చేయడంలో 25 మంది నాట్స్ సభ్యులు, స్థానిక హైస్కూల్ విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సేవలు అందించారు. నాట్స్ చేపట్టిన ఈ కార్యక్రమం స్ఫూర్తితో కేవలం పాఠశాల విద్యార్ధులే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా హైవే క్లీనింగ్‌లో పాల్గొనడం విశేషం.

రెండు మైళ్ల పాటు రహదారికి ఇరువైపులా ఉన్న చెత్త చెదారం నాట్స్ (NATS) సభ్యులు, స్థానికులు కలిసి తొలగించారు. అంతా శుభ్రంగా ఉండేలా చేశారు. విద్యార్ధుల్లో కూడా మన పరిసరాలను మనమే బాగు చేసుకోవాలనే స్ఫూర్తిని నింపేందుకు నాట్స్ ఈ కార్యక్రమం చేపట్టింది.

నాట్స్ (North America Telugu Society) చేపట్టిన ఈ చక్కటి కార్యక్రమంపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇందులో పాల్గొన్న విద్యార్ధులకు నాట్స్ సేవా ధ్రువ పత్రాలను అందించింది. నాట్స్ ఫ్లోరిడా (Florida) టాంపా బే నాయకులు ఎంతో సమర్ధవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం కోసం తమ వంతు సహకారాన్ని అందించిన నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా.కొత్త శేఖరం, బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, బోర్డ్ ఆఫ్ డైరక్టర్ శ్రీనివాస్ మల్లాది తదితరులకు నాట్స్ టాంపా బే (Tampa Bay) విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

ఫైనాన్స్/మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్స్ నేషనల్ కోఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహ మండలి సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కో ఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కోఆర్డినేటర్ విజయ్ కట్టా, కోఆర్డినేటర్ కమిటీ చైర్స్ భరత్ ముద్దన, హరి మండవ చక్కటి ప్రణాళికతో ఈ కార్యక్రమం విజయవంతం చేశారు.

వీరితోపాటు నాట్స్ స్వచ్ఛంద సేవకులు (Volunteers) శ్రీనివాస్ బైరెడ్డి, అనిల్ అరేమండ, భార్గవ మాధవరెడ్డి తమ సహకారాన్ని అందించారు. భావితరాల్లో సేవాభావాన్ని నింపేందుకు కార్యక్రమం చేపట్టి విజయవంతం చేసిన టాంపా బే నాట్స్ విభాగాన్ని నాట్స్ ఛైర్ ఉమన్ అరుణ గంటి (Aruna Ganti) ప్రత్యేకంగా అభినందించారు.

సేవే గమ్యం నినాదానికి తగ్గట్టుగా టాంపా బే విభాగం కార్యక్రమం నిర్వహించిందని నాట్స్ అధ్యక్షులు బాపు నూతి (Bapu Nuthi) టాంపా బే నాయకులను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన, సెక్రటరీ రంజిత్ చాగంటి, ఎగ్జిక్యూటివ్ మీడియా సెక్రటరీ మురళి మేడిచెర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected