Connect with us

Immigration

Qatar: తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం

Published

on

Qatar: ఖతార్‌లో సేవలందిస్తున్న వలసదారుల కృషి, త్యాగాన్ని గుర్తిస్తూ , తెలంగాణ గల్ఫ్ సమితి – ఖతార్ (Telangana Gulf Samithi – Qatar) ఆధ్వర్యంలో వలసదారుల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించబడింది. అధ్యక్షుడు మైధం మధు గారు వలసదారుల బాధ్యతలను గుర్తు చేస్తూ, వారి కృషికి కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే అందరి సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సేవ కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఖాలీద్ (Khalid) గారు, శనవాజ్ బావ్ (ఐసీబీఫ్ అధ్యక్షుడు), దీపక్ శెట్టి (జనరల్ సెక్రటరీ), శంకర్ గౌడ్ (హెడ్ ఆఫ్ లేబర్), APWA అధ్యక్షుడు నరసింహమూర్తి గారు, రాజస్తాన్ కమ్యూనిటీ అధ్యక్షుడు నిజాం ఖాన్ గారు, TKS అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి గారు పాల్గొన్నారు.

అలాగే AKV జెనరల్ సెక్రటరీ సౌమ్య గారు, ఔట్ రిచ్  అధ్యక్షుడు కృష్ణా కుమార్ గారు, APWA ఉపాధ్యక్షులు ఉమా రెడ్డి గారు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఖతార్ (Qatar) మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అధికారుల చేతుల మీదుగా 30 సంవత్సరాలకు పైగా ఖతార్‌లో సేవలందించిన ఐదుగురు  వలసదారులను ప్రత్యేకంగా సత్కరించారు.

ఇందులో నిజామాబాద్ (Nizamabad) జిల్లా తలారంపూర్ గ్రామానికి చెందిన శ్రీధర్ తాడేపు గారు, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండకు చెందిన రామగిరి దీపక్ గారు, కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన అరిపెల్లి  గంగాధర్ గారు, నిజామాబాద్ జిల్లా ముక్తల్ మండలం కొత్తపల్లికి చెందిన బుర్రకుంటా సాయన్న గారు మరియు జగిత్యాల జిల్లా చెలిగల్ గ్రామానికి చెందిన అరపెళ్లి గంగారాం ఉన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs), నాటకాలు, తెలుగు అభిరుచులకు అనుగుణంగా విందునబోజనం, పెద్దల ఉపన్యాసాలతో ఈ కార్యక్రమం అధ్యంతం కనుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కార్యవర్గ సభ్యులు బండపెళ్లి ఎల్లయ్య (ఉపాధ్యక్షుడు), సంధ్య రాణి (జనరల్ సెక్రటరీ), ప్రతిష్ కుమార్ (జాయింట్ జనరల్ సెక్రటరీ), సాగర్ దుర్గం (ఇన్సూరెన్స్ ఇంచార్జ్), రాజేశ్వర్ సాల్లా (మెంబర్షిప్ ఇన్చార్) మరియు మనోహర్, ఎల్లయ్య తల్లపెళ్లి గార్ల ముఖ్యపాత్రం ఉంది.

error: NRI2NRI.COM copyright content is protected