Charlotte, North Carolina: ఛార్లెట్ లో ఎన్నారై టీడిపి (NRI TDP) నాయకులు తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఎమ్మెల్యేలు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి (Kandula Narayana Reddy), ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ (Kuna Ravikumar) తో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలోనే పార్టీ 43వ ఆవిర్భావదినోత్సవ వేడుకలను కూడా నిర్వహించారు.
వర్కింగ్‌డే అయినప్పటికీ దాదాపు రెండు వందల మంది ఛార్లెట్ ఎన్నారైలు (Charlotte NRI) పాల్గొన్నారు. చార్లెట్‌లోని వెడ్డింగ్టన్ (Weddington) రోడ్డులో ఉన్న బావర్చి ఇండియన్ గ్రిల్ రెస్టారెంట్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రసంగించారు.
కూన రవికుమార్మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని అప్పటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీరామారావు (Nandamuri Taraka Rama Rao) స్థాపించారని, సినిమా నటుడి పార్టీ అన్నవారే చివరకు ఈ పార్టీలో చేరి అధికారాన్ని అందుకున్నారని చెప్పారు. ఈరోజు అమెరికాలో ఇన్ని లక్షలమంది తెలుగువాళ్ళు ఐటీ రంగం (IT Sector) లో ముందున్నారంటే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే (Nara Chandrababu Naidu) కారణమని చెప్పారు.
ఆయన విజనరీ ఏ రాజకీయవేత్తకి లేదని ఆయన తన ప్రసంగంలో ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మళ్ళీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతిపథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, ఆయనకు ఎన్నారై (NRI) లు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఎన్నికల సమయంలో పార్టీని గెలిపించేందుకు ముందుకువచ్చినట్లే రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతిబాటలో పయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికోసం పెట్టుబడులు (Investments) పెట్టేందుకు ముందుకురావాలని కోరారు. మరో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కూడా ఎన్నారైలు రాష్ట్ర ప్రగతికోసం ముందుకురావాలని కోరారు.
చంద్రబాబు చేస్తున్న పనులకు, పథకాలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఛార్లెట్ ఎన్నారై టీడీపీ (Charlotte NRI TDP) స్థానిక నాయకులు నాగ పంచుమర్తి (Naga Panchumarthi), ఠాగూర్ మల్లినేని (Tagore Mallineni), రమేష్ ముకుళ్ళ (Ramesh Mukulla), సతీష్ నాగభైరవ, రాజేష్ వెలమల మరియు ఇతర ఎన్నారై టీడీపీ (NRI TDP) కార్యవర్గ సభ్యులు సమన్వయపరచారు.
ఈ మీట్ అండ్ గ్రీట్, TDP 43వ ఆవిర్భావదినోత్సవ వేడుకలలో ఎన్నారై టీడిపి (NRI Telugu Desam Party) తోపాటు, జనసేన (Janasena), బిజెపి (BJP) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చివరన ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసిన వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.