Washington DC: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, తెలుగు వారి ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao – NTR) మార్చి లో, స్థాపించిన తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), 43 ఏళ్లుగా జయాపజయాల కతీతంగా.. రాష్ట్ర ప్రగతికి కట్టుబడి పాలన సాగిస్తూ.. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన, ముస్లిం, మైనారిటీ వర్గాలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలతో పాటు..
ఆనాడు సాఫ్ట్ వేర్ (Software) రంగంలో చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో.. ఈనాడు తెలుగు వారు ప్రపంచం నలుమూలలా అదే రంగంలో విశేషంగా రాణిస్తూ సత్తా చాటుతున్నారు. ఈ సందర్భంగా ప్రవాసులు పార్టీ ప్రస్థానాన్ని, సమర్ధ నాయకుని నాయకత్వ దక్షతను గుర్తుచేసుకుంటూ, ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao) కు ఘన నివాళి అర్పించి 43 వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నారు.
75 సంవత్సరాల వయస్సులో కూడా చంద్రబాబు (Nara Chandrababu Naidu) గారి తపన, 2047 కై ఆయన ప్రణాళికలు సఫలీకృతమవ్వాలని, ఉగాది రోజు ఆయన ప్రతిపాదించిన P-4 పధకానికి తమవంతు భాద్యతగా చేయూతనందిస్తామని ప్రవాసులు తెలిపారు. భాను మాగులూరి (Bhanu Maguluri), రాజేష్ కాసరనేని (Rajesh Kasaraneni) సమన్వయ పరచిన ఈ కార్యక్రమంలో రావు లింగా, జానకి రామ్, నాగ్ నెల్లూరి, సుధీర్ కొమ్మి,యాష్ బొద్దులూరి, సాయి బొల్లినేని, సతీష్ చింత, సురేఖ చనుమోలు, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు..