Edison, New Jersey, March 1, 2025: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీ (New Jersey) లో ఇమ్మిగ్రేషన్ సెమీనార్ (Immigration Seminar) నిర్వహించింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఇమ్మిగ్రేషన్‌పై వస్తున్న వార్తలు ప్రవాస భారతీయులను కలవరపెడుతున్నాయి.
ఈ తరుణంలో ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు భాను బి. ఇల్లింద్ర (Bhanu B Ilindra), శ్రీనివాస్ జొన్నలగడ్డ (Srinivas Jonnalagadda) లు ఈ ఇమ్మిగ్రేషన్ సెమీనార్‌కు ముఖ్య వక్తలుగా విచ్చేసి అనేక కీలకమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా జన్మత: పౌరసత్వం (Citizenship), H1B నుంచి గ్రీన్ కార్డు (Green Card) వరకు అనుసరించాల్సిన మార్గాలు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, H4 Visa.. ఇలాంటి ఇమ్మిగ్రేషన్ అంశాలపై పూర్తి అవగాహన కల్పించారు.
ఈ సెమినార్ లో పాల్గొన్న వారి సందేహాలను కూడా భాను ఇల్లింద్ర, శ్రీనివాస్ జొన్నలగడ్డలు నివృత్తి చేశారు. అమెరికాలో ఉండే తెలుగు వారు ఇమ్మిగ్రేషన్ విషయంలో మీడియాలో వస్తున్న వార్తలతో ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారి ఆందోళన తగ్గించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సెమీనార్ నిర్వహించామని నాట్స్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు శ్రీహరి మందాడి (Srihari Mandadi) తెలిపారు.
అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా ఉంటుందని శ్రీహరి భరోసా ఇచ్చారు. ఈ సెమీనార్ నిర్వహణ కోసం నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టీపీరావు, నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ కో ఆర్డినేటర్ మోహన్ కుమార్ వెనిగళ్ల కృషి చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ సెమీనార్‌కు విచ్చేసిన భాను ఇల్లింద్ర, శ్రీనివాస్ జొన్నలగడ్డలకు నాట్స్ (NATS) నాయకత్వం ధన్యవాదాలు తెలిపారు.
ఇంకా ఈ Immigration Seminar విజయవంతం కావడంలో శ్రీకాంత్ పొనకల, వెంకటేష్ కోడూరి, రాకేష్ వేలూరు, వెంకట్ గోనుగుంట్ల, కృష్ణ సాగర్ రాపర్ల, రామకృష్ణ బోను, వర ప్రసాద్ చట్టు, జతిన్ కొల్లా, బ్రహ్మానందం పుసులూరి, ధర్మ ముమ్మడి, అపర్ణ గండవల్ల, రమేష్ నూతలపాటి, రాజేష్ బేతపూడి, సూర్య గుత్తికొండ, కృష్ణ గోపాల్ నెక్కింటి, శ్రీనివాస్ చెన్నూరు, సాయిలీల మగులూరి కీలక పాత్రలు పోషించారు.
తెలుగు వారికి ఎంతో ఉపయుక్తమైన ఇమ్మిగ్రేషన్ సెమినార్ నిర్వహించిన నాట్స్ న్యూజెర్సీ టీం (NATS New Jersey Team) ను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) మరియు నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి (Madan Pamulapati) ప్రత్యేకంగా అభినందించారు.