Tirumala, Tirupati: తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి NRI లతోపాటు కుటుంబాన్ని కూడా అనుమతించేలా తానా మెంబర్షిప్ బెనిఫిట్స్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని (Sai Bollineni), తానా మాజీ అధ్యక్షులు జయరాం కోమటి (Jayaram Komati) తో కలిసి గత 2024 అక్టోబర్ లో కృషి చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అప్పట్లో అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) కి మరియు ఎన్ఆర్ఐ సాధికారత & సంబంధాల మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) కి వినతిపత్రం సమర్పించారు. ఆ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆ ప్రతిపాదన ప్రకారం ఎన్ఆర్ఐ (NRIs) లకు ప్రస్తుతం లభించే దర్శనంలో ఉన్న పరిమితులు తొలగించి, ఎన్ఆర్ఐ లతోపాటు భారత దేశంలో నివసిస్తున్న తమ కుటుంబ సభ్యులు కూడా ఒకేసారి పాల్గొనేలా వీలు కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams – TTD) వారు ఫిబ్రవరి 5, 2025 న ఆర్డర్స్ పాస్ చేశారు.
ఇందులో భాగంగా డైలీ లిమిట్ కూడా 50 నుంచి 100 మందికి పెంచారు. దీంతో ఎన్ఆర్ఐ భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి భక్తి పూర్వకంగా Tirumala Tirupati శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించినందుకు ప్రవాసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు APNRTS (Andhra Pradesh Non-Resident Telugu Society) వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.