అమెరికాలోని పేద విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్ వితరణ కార్యక్రమాన్ని తానా మాజీ అధ్యక్షులు డా. నవనీత కృష్ణ ఏ శుభ ఘడియల్లో ప్రారంభించారో తెలియదుగానీ అమెరికా అంతటా మంచి ప్రజాదరణ పొందింది. అలాగే ఇప్పటికీ ప్రతి సంవత్సరం తానా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడం విశేషం.
ఇందులో భాగంగా అపలాచియన్ ప్రాంత రీజినల్ రిప్రజంటేటివ్ రాజేష్ యార్లగడ్డ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ తానా టీం సెప్టెంబర్ 14, శనివారం రోజున క్యారీ (Cary, North Carolina) పట్టణంలోని డార్కస్ మినిస్ట్రీస్ (Dorcas Ministries) లో బ్యాక్‌ప్యాక్స్ అందించారు.
వివేక్ ఫ్లవర్స్ (Vivek Flowers) వారు బ్యాక్‌ప్యాక్ వితరణ (TANA Backpack Donation) కార్యక్రమానికి స్పాన్సర్ (Sponsor) గా వ్యవహరించారు. బ్యాక్‌ప్యాక్ ల సమీకరణతోపాటు పూర్తి కార్యక్రమాన్ని బాల గర్జల సమన్వయపరచగా, మిథున్ సుంకర తమ సహకారాన్ని అందించారు.
ప్రవీణ్ తాతినేని, సునీల్ కొల్లూరు, ప్రశాంత్ కాట్రగడ్డ, కిరణ్ కాకర్లమూడి, హేమ దాసరి, వినోద్ కాట్రగుంట, వంశి బొట్టు, రవి దర్శి, శ్రీకాంత్ పొలిమేర, భూమేష్ గండే, శ్రీ కాట్రగడ్డ తదితరులు ఈ బ్యాక్‌ప్యాక్ వితరణ (TANA Backpack Donation) కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా అపలాచియన్ ప్రాంత (Appalachian Region) రీజినల్ రిప్రజంటేటివ్ రాజేష్ యార్లగడ్డ మాట్లాడుతూ.. జన్మభూమి తోపాటు కర్మభూమి లో కూడా సహాయం చేయాలనే సదుద్దేశంతో ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. ముందు ముందు కూడా తమ సహకారం తప్పకుండా ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా బ్యాక్‌ప్యాక్స్ స్పాన్సర్ వివేక్ ఫ్లవర్స్, ర్యాలీ తానా టీం (Raleigh TANA Team) సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే డార్కస్ మినిస్ట్రీస్ (Dorcas Ministries, Cary) వారు ర్యాలీ తానా టీం చేసిన సహాయానికి అభినందనలు తెలిపారు. ఈ తానాసేవా కార్యక్రమం కోసం డార్కస్ మినిస్ట్రీస్ ని ఎంపిక చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఎప్పటికప్పుడు ర్యాలీ (Raleigh, North Carolina) ప్రాంతంలో వివిధ సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటు భారతీయ సమాజానికి అటు అమెరికా సమాజానికి ఆసరాగా ఉంటున్న అపలాచియన్ ప్రాంత రీజినల్ రిప్రజంటేటివ్ రాజేష్ యార్లగడ్డ (Rajesh Yarlagadda) సారధ్యంలోని ర్యాలీ తానా టీం ని ప్రవాసులు అభినందిస్తున్నారు.