రామన్నపేట, 2024 మే 21: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ (North America Telugu Society – NATS) తాజాగా తెలుగు రాష్ట్రాల్లో (Telugu Sates) ముమ్మరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
దీనిలో భాగంగానే తెలంగాణ (Telangana) లోని యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా రామన్నపేటలో మహిళలకు కుట్టుమిషన్లను (Sewing Machines) పంపిణీ చేసింది. మహిళలు స్వశక్తితో ఎదగాలనే సంకల్పంతో నాట్స్ (NATS) ఈ కుట్టుమిషన్ల పంపిణీ చేపట్టినట్టు నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి తెలిపారు.
మహిళా సాధికారత (Women Empowerment) కోసం అటు అమెరికాలో ఇటు రాష్ట్రాల్లో నాట్స్ (NATS) అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మహిళలకు కుట్టుమిషన్ల శిక్షణ (Sewing Machines Training) తో పాటు అనేక స్వయం ఉపాధి కార్యక్రమాల్లో శిక్షణకు నాట్స్ చేయూత అందిస్తుందని బాపు నూతి (Bapu Nuthi) వివరించారు.
మహిళలు కుట్టుమిషన్ల ద్వారా స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని నాట్స్ (North America Telugu Society – NATS) బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాట్స్ కార్యవర్గాన్ని అభినందించారు.