Connect with us

Patriotism

దేశభక్తిని పెంపొందించిన NYTTA రిపబ్లిక్ డే వేడుకలు @ New York

Published

on

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే ఫ్లాగ్ హోస్టింగ్ (Republic Day Flag Hoisting) కార్యక్రమాన్ని అబ్బురపరిచే రీతిలో న్యూయార్క్ (New York) లోని బేత్పా్జ్ సీనియర్ కమ్యూనిటీ సెంటర్లో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అధ్యంతం దేశభక్తిని పెంపొందించేలా సాగింది.

నైటా (NYTTA) ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ (Vani Singirikonda) మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ అడ్వైసర్స్ సమిష్టి కృషితో కార్యక్రమాన్ని చాలా చక్కగ నిర్వహించడం జరిగింది. మొదటగ కార్యక్రమాన్ని సెక్రెటరీ రవీందర్ కోడెల ప్రారంబిస్తూ.. 75వ గణతంత్ర దినోత్సవం ఖండాంతరాలు దాటి, ఏ దేశమేగిన ఎందుకలిడిన అంటూ మాతృభూమిలో జరుపుకునే విధముగా ఈ కార్యక్రమానికి వచ్చినవారి అందరిని సాధరంగా ఆహ్వానించారు.

తదుపరి New York Telangana Telugu Association బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సెక్రెటరీ సతీష్ కల్వ గారు మరియు అడ్వైసర్ చిన్నబాబు రెడ్డి గారు అందరిని కార్యక్రమానికి ఆహ్వాహానిస్తూ, జెండా వందనం కార్యక్రమాన్ని ఏర్పాటుకు ప్రెసిడెంట్ వాణి గారిని మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ ని అభినందిచడం జరిగింది.

సింగర్ దివ్య మీనన్ గణేష్ స్తోత్రంతొ మొదటగా కార్యక్రమ ప్రారంభం జరిగింది. సింగర్ జ్యోత్స్నా మరియు దివ్య చక్కటి పాటలతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ముఖ్యంగ జ్యోత్స్నా పాడిన పాటలు అహుతులను ఆకట్టుకున్నాయి. స్పెషల్ టాలెంటెడ్ వండర్ కిడ్ రియా తన యొక్క పంప్ కిన్ స్కిట్ తొ చిన్నారులు మరియు పెద్దల మనసులను అక్కట్టుకుంది.

మిస్ న్యూయార్క్ అవని సోఫియా డిసోజా కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణంగా నిల్వడం జరిగింది. ముఖ్యంగా చిన్నారులు వివిధ రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయలను ప్రతిబింబిచేలా యూనిటీ అండ్ డైవర్సిటీ ప్రోగ్రాం ఆధ్యంతం కొలహాలంగా కరతాల ధ్వనుల మధ్య జరగడం చాలా హర్షనీయo, అభినందనీయం.

NYTTA కార్యక్రమానికి మింగ్లీ నాస్సా కౌంటీ ఎగ్జిక్యూటివ్ గెస్ట్ గా హాజరు అవడం, అదేవిధంగా కౌంటీ తరుపున నైటా కి సైటేషన్ (Citation) ప్రజంట్ చేయడం ఎంతో స్ఫూర్తిదాయకం. ఫిలాంథ్రపిస్ట్, సంస్థ శ్రేయోభిలాషి డా. మల్లారెడ్డి పైళ్ల గారు మరియు వారి సతీమణి సాధన గారు, డోనార్స్, నైటా టీం మరియు కార్యక్రమానికి వచ్చిన వారి అందరి సమక్షములో మల్లా రెడ్డి గారు పతాక ఆవిష్కరణం చేయడం జరిగింది.

తదనంతరం జన గణ మన జాతీయగీతం మరియు అమెరికన్ జాతీయ గీతం (National Anthem) ఆలపిoచడం జరిగింది. గెస్ట్ మింగ్లీ మరియు మల్లా రెడ్డి గారు సింగర్స్ జ్యోత్స్నా, దివ్య మీనన్, వండర్ కిడ్ రియా మరియు అవని మిస్ న్యూయార్క్ లని శాలువా, మెమంటోలతొ సత్కరించడం జరిగింది.

తర్వాత మంచి పాటలు, చిన్నారుల అట పాటలతో కార్యక్రమం ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా జరిగింది. చివరగా ప్రెసిడెంట్ వాణి గారు కార్యక్రమం ఇంత భారీఎత్తున చక్కగా జరగటానికి సహకరించిన ఎగ్జిక్యూటివ్ టీం, బోర్డు అఫ్ డైరెక్టర్స్, అడ్వైసర్స్ మరియు వాలంటీర్స్ అదేవిధంగా కార్యక్రమానికి వచ్చిన చిన్నారులను, పేరెంట్స్, అతిథులు, ధాత లకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

అదేవిధంగా న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (New York Telangana Telugu Association) ఆధ్వర్యంలో ఈ రిపబ్లిక్ డే ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమాన్ని టీవీ మాధ్యమం ద్వారా ప్రసారం చేసిన మన టీవీ మిత్రులకు ధన్యవాదములు తెలియచేయడం జరిగింది. చివరగా చక్కటి విందు భోజనంతొ కార్యక్రమం ముగిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected