తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (Telangana American Telugu Association – TTA) ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కన్వెన్షన్ లో భాగంగా ఇండియాలో సేవా డేస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ సారి డిసెంబర్ 11 నుండి 23 వరకు తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాల వివలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ సారి ప్రత్యేకంగా డిసెంబర్ 18 న వరంగల్ (Warangal) లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. స్థానిక ఐటీ హబ్ (IT-SEZ) లోని క్వాడ్రంట్ టెక్నాలజీస్ (Quadrant Technologies) లో ఏర్పాటు చేస్తున్న ఈ మెగా జాబ్ మేళా లో 2021 నుండి 2024 వరకు గ్రాడ్యుయేట్ అయిన లేక అయ్యే వారు పాల్గొనడానికి అర్హులు.
సుమారు 30 కంపెనీలు ఈ జాబ్ మేళా (Mega Job Mela) లో పాల్గొననున్నాయి. అలాగే మొత్తంగా 1000 నుంచి 1500 మందిని హైర్ చేసుకునేలా ప్రణాళిక పెట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ వంటి మరిన్ని వివరాలకు పై ఫ్లయర్ చూడండి. యువతకి ఉపాధి చూపించే జాబ్ మేళా నిర్వహిస్తున్న TTA ని ముఖ్యంగా అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల ని అందరూ అభినందిస్తున్నారు.