Connect with us

Politics

NRI TDP Atlanta: తెలుగుదేశం పార్టీ నాయకులతో మీట్ & గ్రీట్ విజయవంతం

Published

on

జార్జియా రాష్ట్రం, అట్లాంటా నగరంలో ఇండియా నుండి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్నారై టీడీపీ అట్లాంటా ఆధ్వర్యంలో మీట్ & గ్రీట్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. జులై 12 బుధవారం సాయంత్రం సంక్రాంతి రెస్టారెంట్ బ్యాంక్వెట్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది పాల్గొన్నారు.

మాజీ శాసనమండలి సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు టిడి జనార్దన్, చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జ్ పులివర్తి నాని, నగరి నియోజకవర్గ ఇంచార్జ్ గాలి భానుప్రకాష్, చిత్తూర్ మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ గీరవాణి చంద్రప్రకాష్ దంపతులు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు.

ముందుగా హితేష్ వడ్లమూడి (Hitesh Vadlamudi) అందరికీ స్వాగతం పలికి అతిథులను వేదిక మీదికి ఆహ్వానించారు. యువత పుష్పగుచ్ఛాలతో అతిథులకు సాదర స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకులందరూ ఎన్టీఆర్ విగ్రహానికి పూలతో నివాళులర్పించారు.

టిడి జనార్దన్ అన్న నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Ramarao) మరియు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గురించి, పులివర్తి నాని చంద్రగిరి నియోజకవర్గ పరిస్థితుల గురించి, గాలి భానుప్రకాష్ నగరి నియోజకవర్గం గురించి, అలాగే గీరవాణి చంద్రప్రకాష్ దంపతులు చిత్తూర్ రాజకీయాల గురించి విపులంగా వివరించారు.

APNRT మాజీ అధ్యక్షులు రవి కుమార్ వేమూరు వచ్చే 2024 ఎన్నికలలో ఎన్నారైల పాత్ర, వాళ్ళు ఎలా సహాయపడగలరు అనే విషయాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో న్యూ ఇంగ్లండ్ ప్రాంతం నుంచి అశ్విన్ అట్లూరి కూడా పాల్గొన్నారు.

అనంతరం అతిథుల చేతుల మీదుగా సతీష్ ముసునూరి, అనీల్ యలమంచిలి, నటాషా లావు, కల్పన ఈదర ఎన్టీఆర్ పై రచించిన శకపురుషుడు (NTR Centennial Celebrations) పుస్తకాలను అందుకున్నారు. అతిథులందరినీ స్థానిక ఎన్నారై టీడీపీ అట్లాంటా (NRI TDP Atlanta) నాయకులు ఘనంగా సన్మానించారు.

వారాంతం కానప్పటికీ, వీక్ డే లో అందరూ తమ ఉద్యోగాలతో బిజీగా ఉన్నప్పటికీ, హాజరైన సుమారు 250 మంది ఆహ్వానితులకు మరియు ఇండియా నుండి అట్లాంటా పర్యటనకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపి విందు భోజనంతో కార్యక్రమాన్ని ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected