యువత తమలోని శక్తియుక్తులను వినియోగించుకుని అద్భుతాలు సృష్టించవచ్చని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society) ‘నాట్స్’ అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి అన్నారు. యువతరం తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు.
భారతీయ యువతకు అమెరికాలో అపారమైన అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకునేలా యువత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని బాపయ్య చౌదరి (బాపు) నూతి సూచించారు. ఇంపాక్ట్, యోగ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన గురు సన్నిధి కార్యక్రమంలో బాపు నూతి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఇంపాక్ట్ ఫౌండేషన్ చైర్మన్ గంపా నాగేశ్వరరావు (Gampa Nageshwer Rao) యువతలోని నైపుణ్యాన్నిపెంచేందుకు చేస్తున్న నిస్వార్థమైన సేవలను కొనియాడారు. గురు సన్నిధి కార్యక్రమంలో గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి పాల్గొన్న ఇంపాక్ట్ (Impact Foundation) సభ్యులను, నాయకత్వ బృందాన్ని అభినందించారు.
ఇంపాక్ట్, యోగ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన గురు సన్నిధి కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో నాట్స్ (North America Telugu Society) బోర్డు సభ్యులు మధు బోడపాటి, ఇతర సభ్యులు ప్రసాద్ లావు, సాంబశివరావు, రంగబాబు మరియు ఇతరులు పాల్గొన్నారు.