Connect with us

News

నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న సతీష్ వేమన

Published

on

ఆంధ్రప్రదేశ్ లో నాణ్యమైన ఉన్నత విద్య లేకపోవడం, నిరుద్యోగం పెచ్చుమీరడం, మహిళలు, రైతుల సంక్షేమం ప్రశ్నార్ధకంగా మారిన నేపథ్యంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర యువతలో మనోబలం నింపుతోందని, ప్రజలకు భవిష్యత్తుపై భరోసా కల్పిస్తోందని తానా (TANA) మాజీ అధ్యక్షులు, టీడీపీ (TDP) నాయకులు సతీష్ వేమన పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు (Nellore) నియోజకవర్గంలోని వంశీ రెడ్డిపల్లి, తూగుండ్రం ప్రధాన రహదారిపై గురువారం ప్రారంభమైన 14వ రోజు యువగళం పాదయాత్రలో లోకేష్ తో కలిసి సతీష్ వేమన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తుకు యువగళం పాదయాత్ర దిక్సూచిలా నిలుస్తోందన్నారు.

నారా లోకేష్ (Nara Lokesh) తో కలిసి యువగళం (Yuvagalam) పాదయాత్రలో నడవడానికి గ్రామగ్రామాన అన్ని వర్గాల ప్రజలు పోటీపడుతున్నారన్నారు. పల్లెల్లో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కష్టనష్టాలను లోకేష్ ప్రత్యక్షంగా పరిశీలించి రైతాంగానికి ధైర్యం చెబుతున్నారన్నారు.

కులవృత్తుల వారు తమ గోడును లోకేష్ వద్ద మొరపెట్టుకోవడం చూస్తే తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధికారం చేపట్టాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్న విషయం స్పష్టమౌతోందన్నారు. ఇదే స్ఫూర్తితో 400 రోజుల యువగళం పాదయాత్ర విజయవంతమౌతుందని సతీష్ వేమన (Satish Vemana) ఆకాంక్షించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected