ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలో ఘనంగా నిర్వహించారు. జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా, టెక్సస్ రాష్ట్రంలోని డల్లాస్, వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటిల్ నగరాల్లో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
ఆయా నగరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) అభిమానులు, శ్రేయోభిలాషులు, సానుభూతిపరులు సమావేశమయ్యారు. కేక్ కట్ చేసి అందరికీ అభిమానంతో పంచారు. జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మైల్స్టోన్ 50 వ పుట్టినరోజు కావడంతో అభిమానులు కేరింతలు కొట్టారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు జగన్ ని కీర్తిస్తూ ప్రసంగించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhara Reddy), వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జండాలతో వేదిక ప్రాంగణాన్ని అలంకరించారు. కొన్ని చోట్ల ముఖ్యంగా సియాటిల్, పోర్ట్లాండ్ ప్రాంతంలో మంచు కురుస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పటి ఫోటోలు, వీడియోలు ప్రదర్శించి ఆహ్లాదంగా గడిపారు. జగన్ ప్రభుత్వం గురించి మీడియాతో పంచుకున్నారు. ఇలాగే మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ని దీవించారు.