చంద్ర బాబుతోనే రాష్ట్ర అభివృద్ధి:.. భవిష్యత్తు బాగుండాలి అంటే బాబు రావాలి… అని గన్నవరం (Gannavaram) నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈరోజు ఉదయం బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ వెంకట్రావు స్థానిక టిడిపి శ్రేణులు, గ్రామ ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేసి జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. చంద్రబాబు (Nara Chandrababu Naidu) తోనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమన్నారు, తెలుగుదేశం అధికారం చేపట్టిన తరువాత మానిఫెస్టో ప్రకారం యువతకు ఉపాధి, మహిళలకు మహాశక్తి పథకము ద్వారా ఏడాదికి ఒక్కొక్కరికి 18 వేల రూపాయలు చొప్పున ఐదేళ్లకు 90000 రూపాయలు, తల్లికి వందనం ద్వారా ప్రతి తల్లికి ఏడాదికి 15000 రూపాయలు, దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఉచిత ప్రయాణం, అన్నదాత పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు, పిల్లలకు భవిష్యత్తు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేసి ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కిస్తామన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకపోయినా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడాన్ని ప్రజలంతా నిరసిస్తున్నారనిచెప్పారు. వైసిపి ఆగడాలకు త్వరలో ఫుల్ స్టాప్ పడుతుందన్నారు. అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదన్నారు. సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత,సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ.. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు 2015-19 నాలుగు సంవత్సరాలలో 358 టీఎంసీలు కృష్ణా డెల్టాకు నీరు అందించి రైతులకు 45 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటట్లు చేస్తే ఈ మూర్ఖత్వపు వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో పట్టిసీమను నిర్వీర్యం చేసి కావాలని పంపులను పూర్తిస్థాయిలో ఆన్ చేయకుండా కృష్ణ డెల్టాకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం రంగన్నగూడెం తెలుగు యువత నూతన కమిటీ ఆధ్వర్యంలో యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkata Rao) ను దుశ్యాలువాతొ ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందచేశారు. గ్రామంలో గుండెకు సంబంధించిన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న టిడిపి (Telugu Desam Party) కార్యకర్తలు కైతేపల్లి రంగారావు, కొలుసు కృష్ణ లకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున యార్లగడ్డ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ టిడిపి నేత ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, మండల టీడీపీ (TDP) అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్, గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి, ఎంపీటీసీ సభ్యులు పుసులూరు లక్ష్మీనారాయణ, గ్రామ టిడిపి అధ్యక్షులు మొవ్వ వేణుగోపాల్, జిల్లా యువత నాయకులు మందాడి రవీంద్ర, గుండెపూడి నితీష్ కుమార్ , గ్రామ యువత అధ్యక్షులు కొలుసు వెంకట రాంబాబు, గ్రామ టిడిపి నాయకులు కసుకుర్తి వేణుబాబు, కనకవల్లి శేషగిరిరావు, మందపాటి రాంబాబు, పల్లగాని వీరాంజనేయులు, మరీదు తిరుపతిరావు, బెజవాడ వెంకట కృష్ణారావు, దోమవరపు బాబురావు, కనకవల్లి యాకోబు, కసుకుర్తి అర్జున రావు, పుసులూరి పూర్ణ వెంకట ప్రసాద్, నెరుసు తాతయ్య, కసుకుర్తి కృష్ణ కిషోర్, ఆలపాటి రాంబాబు, కొలుసు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.