Connect with us

News

మాజీ మంత్రి, రాజకీయ కురువృద్ధులు యడ్లపాటి వెంకట్రావు అనార్యోగంతో మృతి

Published

on

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. 104 సంవత్సరాల యడ్లపాటి గత కొన్నాళ్ళుగా అనార్యోగంతో బాధపడుతూ సోమవారం ఫిబ్రవరి 28 తెల్లవారుజామున హైదరాబాద్‎లోని తన కూతురు నివాసంలో తుదిశ్వాస విడిచారు.

1967 లో ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా వేమూరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన యడ్లపాటి,1978-80 లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసారు. 1983 లో తెలుగుదేశం పార్టీలో చేరిన యడ్లపాటి, 1995 లో గుంటూరు జడ్పీ ఛైర్మన్ గా పనిచేసారు. అలాగే 1998 లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన యడ్లపాటి వెంకటరావు, 2004 నుంచి వయస్సు రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments