తెలంగాణలో ఊరూ వాడా పూలజాతర సందడి చేస్తున్నట్టే అమెరికా లో కూడా విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) సంస్థ వారు బతుకమ్మ వేడుకలను వర్జీనియా రాష్ట్రంలోని FAIRFAX నగరంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ప్రకృతి మురిసిపోయేట్టు రంగురంగుల పూలను పేర్చి ఆడుకునే రంగుల పండుగ బతుకమ్మ ఇక్కడ SV లోటస్ టెంపుల్ ఆవరణలో బతుకమ్మ పండుగ శోభ సంతరించుకుంది.
పూలతో బతుకమ్మని పేర్చి, పసుపు ముద్దతో గౌరమ్మని అలంకరించుకుని, “ఒక్కొక్క పువ్వేసి చందమామా…ఒక్క జాము గడిచె చందమామా “, ” బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో మాతల్లి బతుకమ్మ ఊయ్యాలో” అంటూ అనేక జానపద పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సంప్రదాయ వస్త్రదారణలో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు. అంతా కలసి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడి సందడి చేశారు.
మహిళా శక్తి స్వరూపిణిగా చెప్పే ఈ దసరా నవరాత్రి రోజులలో వచ్చే సంబరాల్లో “బతుకమ్మ పండుగ” తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్న విషయం తెలిసిందే. ‘ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా)’ స్థాపించినప్పటినుంచి ప్రతి ఏడాది ఈ బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
అయితే ఈ సంవత్సర వేడుకలలో ప్రముఖ సినిమా తార, టీవీ Anchor ఉదయ భాను ప్రత్యేక ఆకర్షణ! ఉదయ భాను గారు ఆహుతులతో కలిసి ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మ ఆడడమే కాకుండా వివిధ కార్యక్రమాలతో కార్యక్రమానికి వచ్చిన వారందరిని అలరించారు.
ఈ కార్యక్రమానికి దాదాపు 800 మంది పెద్దలు, పిల్లలు వచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికి WETA ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల, advisory కౌన్సిల్ కో-చైర్ Dr అభితేజ కొండా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి, నేషనల్ మీడియా చైర్ సుగుణ రెడ్డి కృతఙ్ఞతలు తెలియచేశారు.
ఈ కార్యక్రమం వర్జీనియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ జయశ్రీ తెలుకుంట్ల, మేరీల్యాండ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ ప్రీతి రెడ్డి, రీజినల్ కల్చరల్ చైర్ చైతన్య పోలోజు, రీజినల్ కోర్ కమిటీ స్మృతి రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. సతీష్ వడ్డే, సుధ పాలడుగు, సతీష్ వేమన, విశ్వేశ్వర్ కలవాల, కాంగ్రెస్ మహిళ జెన్నిఫర్ వెక్స్టన్ హాజరయ్యారు. Green and Beyond Siri Kompally 500 మొక్కలు ఇచ్చారు.