Connect with us

Patriotism

కాలిఫోర్నియా బే ఏరియాలో భారతీయత ఉట్టిపడేలా ‘వేటా’ ఫ్లోట్ – ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌

Published

on

కాలిఫోర్నియా బే ఏరియాలోని ఫ్రీమాంట్ నగరంలో “ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌” సందర్భంగా FOG (Festival of Globe) సంస్థ ఆధ్వర్యంలో స్వతంత్ర భారత్‌ వజ్రోత్సవాల వేడుకలు ఆగష్టు 20న ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం అనేక స్థానిక భారతీయ సాంస్కృతిక సంస్థలు తమ తమ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేట్టుగా ముస్తాబు చేసిన శకటాలను నగర వీధుల్లో ఊరేగించారు.

ఇందులో విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA ) సంస్థ వారు భారతీయ మహిళా శక్తి ని లోకానికి తెలియ చెప్పిన “రాణి రుద్రమ దేవి” తో పాటు వివిధ రంగాలలో రాణించి భారతావనికి కీర్తి తెచ్చిన మహిళా నాయకులైన “ఇందిరా గాంధీ’, ప్రతిభ పాటిల్, Mother థెరెసా, Priya Jhingan, Kiran Bedi, Kalpana Chawla ప్రతిమలతో అలంకరించిన శకటం ప్రత్యేక ఆకర్షణ గ నిలిచింది.

WETA శకటం మరియు సంస్థ చేసిన వివిధ సేవ కార్యక్రమాలను అభినందిస్తూ “బెస్ట్ కమ్యూనిటీ సేవ” అవార్డును గెలుచుకున్నారు. ఈ శకటం లో వివిధ నాయకుల వేషధారులై ఊరేగింపు ఆద్యంతం ఆహుతులను అలరించిన భావి తరాలకు ఆదర్శనంగా నిలిచిన “చిన్నారులు” ప్రత్యేక అభినందలు అందుకున్నారు. ఈ వేడుకల్ని ప్రత్యక్షంగా తిలకించడానికి దాదాపు 2 వేల మంది ఆహుతులు వచ్చారు.

“తెలుగు మహిళల కోట.. స్త్రీ ప్రగతి పథమే బాట’ అనే నినాదంతో కేవలం తెలుగు మహిళల కోసమే “మహిళ సాధికారతే”లక్ష్యంగా తెలుగు నేలకు చెందిన ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా)’ అనే సంస్థను రెండు సంవత్సరాల క్రింద ఉత్తర అమెరికాలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

మహిళకు అవకాశాలు కల్పించి వారిలో సృజనాత్మకతను (క్రియేటివిటీ) పెంచి వారి కలలను సాకారం చేసూకోవడానికి ఈ సంస్థ తోడ్పడాలని ఉద్దేశ్యంతో ఝాన్సీరెడ్డి ఈ సంఘం స్థాపించారు. మహిళ నాయకత్వ శక్తిని ప్రపంచానికి తెలియచేసేటందుకు ఇది వేదిక లాగా పనిచేస్తుంది.

ఈ వేడుకలలో ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల, advisory కౌన్సిల్ కో-చైర్ Dr అభితేజ కొండా , ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి, కోర్ కమిటీ అనురాధ, హైమ, పూజ, విశ్వ, మీడియా చైర్ సుగుణ రెడ్డి, కల్చరల్ చైర్ రత్నమాల వంక తో పాటు సరోజ మంగ, శైలజ గిలేలా, సునీత గంప, చందన రెడ్డి, మాధురి రెడ్డి, దివ్య, భువన్ వేమిరెడ్డి , వినీత్ మరియు అనేక మంది వాలంటీర్ మెంబెర్స్ పాల్గొని విజయ వంతం చేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected