ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) వారు బతుకమ్మ వేడుకలను కాలిఫోర్నియా (California) రాష్ట్రంలోనిహ్యాన్ఫోర్డ్ (Hanford) సిటీలోఘనంగా నిర్వహించారు. ప్రకృతి మురిసిపోయేట్టు రంగు రంగుల పూలను పేర్చి ఆడుకునే ఈ బతుకమ్మ పండుగతో వేటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల గారి బంగ్లా ఆవరణ పండుగ శోభ సంతరించుకుంది.
బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో మాతల్లి బతుకమ్మ ఊయ్యాలో అంటూ జానపద పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు. అంతా కలసి బతుకమ్మ (Bathukamma) చుట్టూ తిరుగుతూ ఆడిపాడి సందడి చేశారు.
వేటా (Women Empowerment Telugu Association) స్థాపించినప్పటినుంచి ప్రతి ఏడాది ఈ బ్రతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. చక్కని పండుగ వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. వేటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ఫుడ్ స్పాన్సర్ చేసిన డా. కాంతం మరియు సుజాత గాదె గారికి ఝాన్సీ గారు కృతజ్ఞతలు తెలియచేశారు. అలాగే వేటా కోశాధికారి విశ్వ వేమిరెడ్డి, కమ్యూనిటీ చైర్ జ్యోతి, RVP పూజ రెడ్డి, సెక్రటరీ అనురాధ అలిశెట్టి, హైమ అనుమాండ్ల తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.