Connect with us

Government

Texas రాజధాని Austin లో చంద్రబాబుకి మద్దతుగా ర్యాలీ

Published

on

ఆధారాలు లేని రిపోర్ట్ తో గడిచిన 8 రోజులుగా నారా చంద్రబాబు నాయుడు అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు టెక్సస్ రాజధాని ఆస్టిన్ లో ప్రవాస ఆంధ్రులు, తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు, కుటుంబ సభ్యులతో కలిసి 400 మందికి పైగా స్వచ్చంధంగా నిరసన తెలియచేసారు.

నారా చంద్రబాబు నాయుడు కృషితో ఈ రోజు అగ్రరాజ్యంలో మంచి హోదాలలో వివిధ కంపెనీలో లబ్ధిపొందుతున్నాం అని కొనియాడారు. ఇలా అన్యాయంగా, కక్షపూర్వితంగా నిర్బందించటం అరాచక పాలకుల తీరుకి నిదర్శనం.

నారా చంద్రబాబు నాయుడిని (Nara Chandrababu Naidu) త్వరగా ఆరోగ్యంగా, గౌరవంగా విడుదల చేయాలి అని, శాంతియుతంగా జై బాబు జై జై బాబు, ప్రజాస్వామ్యన్ని కాపాడండి వంటి అనేక నినాదాలతో (Slogans) కార్యక్రమం ముగించారు.

ఈకార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత, సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఏపి అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, ఎన్ అర్ ఐ టీడీపీ ఆస్టిన్ కార్యవర్గ సభ్యులు లెనిన్ ఎర్రం, సుమంత్ పుసులూరి, రవి కొత్త, హరి బాచిన, ఉదయ్ మేక, శ్రీధర్ పోలవరపు, శివ తాళ్లూరి, ప్రసాద్ కాకుమాను, రఘు దొప్పలపూడి, సతీష్ గన్నమనేని, చిరంజీవి ముప్పనేని, యశ్వంత్ పెద్దినేని, కార్తీక్ గోగినేని, సాంబ వెలమ, సద చిగురుపాటి, రంగ గాడిపర్తి, కృష్ణ ధూళిపాళ్ల, బాలాజీ పర్వతనేని, శ్రీని బైరపనేని, భాను వేములపల్లి, బాలాజీ గుడి మరియు ఇతర సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected