Connect with us

Politics

టీడీపీ కి మద్దతుగా సమరశంఖం పూరించిన Washington DC మహిళలు

Published

on

Washington DC, US: వైసీపీ అరాచకాలపై మేము సైతం అంటూ ఎన్ఆర్ఐ మహిళలు సమరశంఖం పూరించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ (Washington DC), వర్జీనియాలో (Virginia) ఎన్ఆర్ఐ మహిళల ఆధ్వర్వంలో సమావేశం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ (NTR) చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సాయిసుధ పాలడుగు మాట్లాడుతూ.. స్వస్థలాలకు వెళ్లగలిగిన వారు వెళ్లి ఏదో ఒక రూపంలో సహాయపడటం, లేదా కనీసం ఇక్కడి నుంచైనా టీడీపీ (TDP) విజయానికి సహకారం అందించాలన్నారు. మంజూష గోరంట్ల మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

అనిత మన్నవ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలను నాశనం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మనవంతు కర్తవ్యం నిర్వహించాలన్నారు. సింధు పూసల మాట్లాడుతూ.. అమెరికాలో ఉంటున్న మాకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల చాలా ఆందోళనగా ఉంది. అందుకు మేము సైతం మా వంతుగా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నాం.

శాంతి పారుపల్లి మాట్లాడుతూ.. యువత భవిష్యత్ బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధికారంలోకి రావాలి. విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రతిఒక్కరు కృషిచేయాలన్నారు. నీలిమా మండవ మాట్లాడుతూ.. మా ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్రానికి రావడంతో పాటు.. స్నేహితులు, బంధువులను కూడా చైతన్యపరుస్తాం.

ఈ కార్యక్రమంలో సరిత పోసాని, రజని పాలడుగు, ప్రణీత కంతు, విద్య కుక్కపల్లి, కృష్ణవేణి కూరపాటి, శ్రీవిద్య సోమ, పద్మ యడ్లపల్లి, కార్జెల్ చలసాని, ప్రసన్న కొల్ల, సౌజన్య కొడాలి, శ్రీదేవి, లక్ష్మి గుంటు, సుధ ధూళిపాళ్ల, రాజీ మదమంచి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected