Connect with us

Government

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రజాపాలన; అభినందించిన ప్రవాసులు @ Washington DC

Published

on

తెలంగాణ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి ఎనుముల పదవీ భాద్యతలు చేపట్టి విజయవంతంగా ప్రజాపాలన అందిస్తున్న సందర్భం గా ఆదివారం, జనవరి 7న అమెరికాలోని వాషింగ్టన్ డి.సి (Washington DC), ఫెయిర్ ఫీల్డ్ మ్యారియట్ హోటల్ లో ఒక కార్యక్రమం నిర్వహించారు.

పోచంపల్లి తిరుపతి రెడ్డి, కొండా రాంమోహన్ రెడ్డి, గొలుగూరి మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి (Revanth Reddy Anumula) అభిమానులు నిర్వహించిన సమావేశానికి మూడు వందల మందికి పైగా ఎన్నారైలు హాజరయ్యారు.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఎనుముల ముప్పై రోజుల ప్రజాపాలన భారత దేశానికే (India) ఆదర్శంగా నిలుస్తుందని, జనరంజకమైన పాలనతో తెలంగాణ రాష్ట్రం (Telangana State) అభివృద్ధి పథంలొ ప్రయాణించాలని ఆకాంక్షించారు.

మరో మూడు నెలలలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా తెలంగాణ లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ (Indian National Congress Party) ఘన విజయం సాధించి రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారతదేశ ప్రధానమంత్రి కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్ది సోదరులు ఎనుముల జగదీశ్ రెడ్డి తో పాటు, పోచంపల్లి తిరుపతిరెడ్డి, కొండా రాంమోహన్ రెడ్డి, గొలుగూరి మూర్తిరెడ్డి, బొందుగుల జగదీశ్ రెడ్డి, మాదవరం నాగేందర్, భువనేశ్ బుజాల, అమర్ బొజ్జా, ప్రొద్దుటూరి రమణారెడ్డి, రవి బొజ్జా, అజయ్ గంజి, శ్రవణ్ పాడూరి, విజయపాల్ పైళ్ళ, వేణు నక్షత్రం, శ్రీనివాస్ తాటిపాముల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected