Connect with us

Government

Amaravathi చట్టబద్దతపై అమెరికా రాజధాని, వర్జీనియా ప్రవాసుల హర్షం

Published

on

Washington D.C.: ఆంధ్ర రాష్ట్ర శాశ్వత, ఏకైక రాజధానిగా అమరావతి (Amaravathi) ని నిర్ణయిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లును స్వాగతిస్తూ అమెరికా రాజధాని ప్రాంత ప్రవాస తెలుగువారు సర్వత్రా తమ హర్షాన్ని వ్యక్తంచేశారు.

కార్యక్రమ సమన్వయకర్త భానుప్రకాష్ మాగులూరి (Bhanu Maguluri) మాట్లాడుతూ.. అమ్మలాంటి భూమాతను నమ్మి, శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతు.. స్వచ్ఛందంగా భూమినిచ్చి కూడా తన ఇంట, కంట 1631 రోజుల పాటు ఆరని మంటతో కూడిన వ్యధను భరించారని (2019 డిసెంబర్18 – 2024 జూన్ 12 ) ఇలాంటి కష్టం దేశంలో ఏ ప్రాంతంలోని రైతుబిడ్డకూ, కుటుంబానికీ రాకూడదని రాజధాని ప్రాంత ప్రవాస భారతీయుల తల్లిదండ్రులు అన్నారు.

యష్ బొద్దులూరి (Yash Bodduluri) మాట్లాడుతూ.. ఐదేళ్లపాటు చీకటి పాలనా సాగించిన దుష్ట రాజకీయ క్రీడకు, నాయకులకు ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు. రైతుబిడ్డలుగా భాద్యతగా ఈ సందర్భాన్ని ఆహ్వానిస్తూ, అమరావతి (Amaravathi) ప్రగతి మన రాష్ట్ర (Andhra Pradesh) యువత భవితకు వేదిక కానుందని, ప్రపంచంలోనే అతిపెద్ద రాజధానిగా అవతరించాలని తమ పలువురు ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వెంకట్, మురళీ కృష్ణ కట్ల, రమేష్ అవిర్నేని, ఫణి యలమంచిలి, హనుమంతరావు యంపరాల, అభిరామ్ కందుల, కృష్ణమోహన్ జంపాల, కిషోర్ కొడాలి, వెంకటేశ్వర్రావు సామినేని, నరేంద్ర, సీతారామారావు ఎండూరు, సుబ్బారావు చిట్యాల, చంద్రనాధ్ నంబూరు, కామేశ్వరరావు కొత్తూరు, అమరలింగం చనుమోలు, మల్లికార్జునరావు పుట్రేవు, రామ్మోహనరావు చిలకలపూడి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected