అక్టోబర్ 13వ తేదీ, ఆదివారం రోజున ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ నిర్వహించిన వాలీబాల్ (Volleyball) మరియు త్రోబాల్ (Throwball) టోర్నమెంట్లు విజయవంతంగా ముగిశాయి. తానా ర్యాలీ చాప్టర్ నిర్వహించిన ఈ పోటీలకు నార్త్ కెరొలినా రాష్ట్రం, క్యారీ పట్టణంలోని నార్త్ క్యారీ పార్క్ (North Cary Park) వేదికగా నిలిచింది.
పురుషులు మరియు మహిళలు పెద్ద ఎత్తున తమ జట్లతో పాల్గొనడంతో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ క్రీడా పోటీలు రాత్రి 7:30 గంటలకు బహుమతి, ట్రోఫీ ప్రదానోత్సవంతో ఘనంగా ముగిశాయి. విజేతలకు నగదు బహుమతులు (Cash Prizes) కూడా అందజేశారు.
దాదాపు $1200 క్యాష్ ప్రైజెస్ అందించిన ఈ వాలీబాల్ మరియు త్రోబాల్ క్రీడా పోటీలలో పురుషులకు ఏమాత్రం తగ్గకుండా సమఉజ్జీల వలే మహిళలు పోటీపడ్డారు. వీరి స్నేహితులు కూడా ఛీర్ చేస్తూ క్రీడాస్ఫూర్తిని చాటారు. క్రీడాకారుల పోటీతత్వం, ఎనర్జీ లెవెల్స్ కి క్రీడా ప్రాంగణం కోలాహలంగా మారింది.
తానా నాయకుల (TANA Leaders) చేతుల మీదుగా బహుమతి, ట్రోఫీ ప్రదానోత్సవం అనంతరం అపలాచియన్ ప్రాంత సమన్వయకర్త రాజేష్ యార్లగడ్డ (Rajesh Yarlagadda) మాట్లాడుతూ… పెద్ద ఎత్తున పాల్గొన్న క్రీడాకారులకు, క్రీడాకారిణిలకు, స్పాన్సర్స్ కు, చార్లెట్ నుంచి విచ్చేసిన తానా క్రీడా కార్యదర్శి నాగ పంచుమర్తి (Naga Panchumarthi) కి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ టోర్నమెంట్స్ నిర్వహణలో అద్వితీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన వంశి కట్టా మరియు మిథున్ సుంకర లను అభినందించారు. టోర్నమెంట్స్ (Volleyball & Throwball Tournaments) సాఫీగా సాగేలా చూసిన వాలంటీర్స్ వినోద్ కాట్రగుంట, ధనుంజయ్, బాల గర్జల, సాయి సుధాకర్ దాసరి మరియు రవి దర్శి లకు కృతఙ్ఞతలు తెలిపారు.
అలాగే తానా ర్యాలీ చాప్టర్ (TANA Raleigh Chapter) నిర్వహించే ప్రతి కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న తానా ఫౌండేషన్ (TANA Foundation) ట్రస్టీ రామ్ అల్లు, ప్రవీణ్ తాతినేని, సునీల్ కొల్లూరు, హేమ దాసరి, నిత్య గింజుపల్లి, రమేష్ తుమ్మలపల్లి, వెంకట్ కోగంటి, శ్రీకాంత్ ఉప్పలపాటి, శ్రీపాద కాసు, వేణు తదితరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తానా క్రీడా కార్యదర్శి నాగ పంచుమర్తి మాట్లాడుతూ… కమ్యూనిటీ కోసం తానా (TANA) వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోందని, అలాగే ఆటగాళ్ళ ప్రతిభను వెలికితీసేందుకు పలు క్రీడా పోటీలను (Sports Competitions) ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ టోర్నమెంట్లలో పాల్గొని విజయాన్ని సాధించిన టీమ్లను నాగ అభినందించారు.
ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ర్యాలీ చాప్టర్ నాయకులను వాలీబాల్ మరియు త్రోబాల్ టోర్నమెంట్లలో (Volleyball & Throwball Tournaments) పాల్గొన్న క్రీడాకారులు మరియు క్రీడాకారిణిలు కొనియాడారు.