శంకరాచార్యులు స్థాపించిన శంకర పీఠాలు శృంగేరీ, బద్రి, పూరి, ద్వారక, కంచి మాత్రమే అని, విశాఖపట్నంలోని శారదా పీఠం డూప్లికేట్ శంకర పీఠమని గోవిందానంద సరస్వతి అన్నారు. ప్రభుత్వ గుర్తింపుతో పీఠాలకు గుర్తింపు రాదని, అసలు పీఠాధిపతులు రాజకీయాలు చేయడమేంటన్నారు. విశాఖపట్నంలోని శారదా పీఠాధిపతి జగన్ రెడ్డితో రాసుకుపూసుకు తిరుగుతుండడంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జగన్ రెడ్డి లాగే ఉన్న డూప్లికేట్ వ్యక్తి వస్తే ఆయన్ను కూడా సీఎంను చేస్తారా అని గోవిందానంద సరస్వతి ప్రశ్నించారు.