Connect with us

Arts

ఆకట్టుకున్న వర్జీనియా మనబడి పిల్లల శ్రీ కృష్ణ రాయబారం పద్య నాటకం

Published

on

శ్రీ కృష్ణుడు పాండవులకు మరియు కౌరవులకు సంధి ఒనర్చుటకు పాండవ రాయబారిగా హస్తినకు వెళ్ళు ముందు పాండవుల కుటుంబముతో అంతరంగ సమావేశ ఘట్టము.

ఈ నాటకాన్ని కళారత్న శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు దర్శకత్వం వహించగా, అమెరికా లో పుట్టి పెరిగిన పిల్లలు మనబడి వర్జీనియా (Virginia) లో తెలుగు నేర్చుకుని, తెలుగు మాటే కాదు, పాట, పద్యము తో పాటు నాటాకాన్ని కూడా అత్యద్భుతంగా 2023 తానా మహా సభలలో ముఖ్య వేదిక పై ప్రదర్శన చేసి, ప్రేక్షకులను అలరించి మన్ననలను పొందారు.

తెలుగు వారికే సొంతము అయినదియు, మరుగున పడుతున్న ఈ పద్య నాటక కళను చూసి ప్రోత్సహించండి – ఈ చిన్నారులను దీవించండి. ఈ పద్య నాటకాన్ని చూసి మా లాగానే మీరు కూడా మైమరుస్తారని ఒక చిన్న ఆశ. కృష్ణుడిగా సాయి శరణ్య భాగవతుల, ధర్మరాజుగా శ్రీకర్ కొవ్వాలి, భీముడిగా ఆదర్శ్ మెహెర్ ముండ్రాతి, ద్రౌపదిగా లాస్య భాగవతుల, అర్జునుడిగా వేద్ జూపల్లి, నకులుడిగా వైష్ణవి పరిమి, సహదేవుడిగా శ్రీహిత వెజ్జు వెంకట తమ తమ పాత్రల లో బహు చక్కని వాచకం మరియు అభినయం తో ఉత్తమ ప్రదర్శనను కనబరిచారు.

రంగస్థల కళ పై మక్కువ తో ఈ పిల్లలకు ఎంతో ఓపికతో నేర్పించి తద్వారా భావి తరాలకు అందించటానికి కృషి చేస్తున్న గురువు “కళారత్న” శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ గారికి మరియు వీరిని సంపూర్ణంగా ప్రోత్సహించిన డా. మూల్పూరి వెంకట్రావు గారికి అందరి తరఫు నుండి హృదయ పూర్వక ధన్యవాదాలు.

చివరగా అందరిని సమన్వయ పరుచుకుని ఈ పద్య నాటకం ఇంత విజయవంతంగా ప్రదర్శించబడడానికి కారకులైన చాంట్లి మనబడి సెంటెర్ కో-ఆర్డినేటర్ రాజ్ కొవ్వాలి గారికి మరియు వర్జీనియా మనబడి పిల్లలు తానా లో ప్రదర్శించిన శ్రీ కృష్ణ రాయబారం పద్య నాటకం : ఉప ప్లావ్యము ఘట్టము సంపూర్ణంగా ప్రోత్సహించిన సిలికానాంధ్ర మనబడి యాజమాన్యానికి ఆనంద్ కూచిబొట్ల మరియు రాజు చమర్తి గారికి ప్రత్యేక ధన్యవాదములు.

ఈ పద్య నాటకాన్ని లైవ్ లో చూసిన ప్రతి చిన్న మరియు పెద్ద వారు ఈలలతో అరుపులతో పిల్లల పద్యాలను మరియు అభినయాన్ని కరతాళధ్వనులతో ప్రశంసించారు. తానా లో ప్రదర్శించిన శ్రీ కృష్ణ రాయబారం పద్య నాటకం : ఉప ప్లావ్యము ఘట్టము ఈ క్రింది యుట్యుబ్ లింక్ లో వీక్షించవచ్చు.

error: NRI2NRI.COM copyright content is protected