Connect with us

News

అందేల శ్రీరామ్ యాదవ్ కోసం NRI విలాస్ జంబుల ప్రచారం @ Telangana

Published

on

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈ ఎన్నికలలో ఓటు వేసేందుకు అమెరికా నుంచి ఇండియా వెళ్లిన విలాస్ రెడ్డి జంబుల తన వంతుగా భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గము లో భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి అందేల శ్రీరామ్ యాదవ్ గెలుపు కోసం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు Bokka Narsimha Reddy తో కలిసి విలాస్ రెడ్డి జంబుల (Vilas Reddy Jambula) ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి విలాస్ రెడ్డి ప్రసంగిస్తూ.. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన శ్రీరామ్ యాదవ్ ని గెలిపించి బీజేపీ నుంచి ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యేలా మహేశ్వరం నియోజకవర్గం నుంచే మొదలవ్వాలన్నారు. అనంతరం నిర్వహించిన బైక్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected