Connect with us

Community Service

సేవే పరమావధిగా సాగుతున్న విక్రమ్ ఇందుకూరి @ Raleigh, North Carolina

Published

on

నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ (Raleigh) నగరానికి చెందిన విక్రమ్ ఇందుకూరి (Vikram Indukuri) అనునిత్యం ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా, భీమవరంలో పుట్టి పెరిగిన విక్రమ్ కుటుంబం వ్యాపారరీత్యా విశాఖపట్టణం (Vizag) లో సెటిల్ అయ్యారు.

బాల్యం, విద్యాబుద్ధులు అన్నీ విశాఖపట్టణంలో కొనసాగిన అనంతరం 2001 లో ఉద్యోగ రీత్యా విక్రమ్ ఇందుకూరి (Vikram Indukuri) అమెరికా విచ్చేశారు. ఉద్యోగంలో రాణిస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పారిశ్రామిక వేత్త (IT Entrepreneur) గా ఎదిగారు. పలు కంపెనీలను స్థాపించి అనేకమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.

ఒక పక్క వృత్తి పరంగా బిజీగా ఉన్నప్పటికీ ఇటు కర్మభూమిని అటు మాతృభూమిని మరువకుండా ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాలతో సేవాతత్పరతను చాటుకున్నారు. గత 20 ఏళ్లుగా ఇండియాలోని పేద విద్యార్థులకు చదువు, ఫీజుల విషయంలో సహాయం చేస్తూ వస్తున్నారు. వీరిలో కొందరు ఇప్పుడు అమెరికా (USA) వచ్చి ఉద్యోగాలు చేసుకోవడం హర్షణీయం.

వేదపాఠశాలలు అంతరిస్తున్న తరుణంలో ఇండియాలో వేదపాఠశాల ని స్థాపించడంలో (Vikram Indukuri) కీలక భూమిక వహించారు. 14 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ వేదపాఠశాలలో ప్రస్తుతం 24 మంది పేద విద్యార్థులు ఉన్నారు. వీరిలో కొందరు 6 సంవత్సరాల వయస్సులో మొదలు పెట్టి కృష్ణా యజుర్వేదం పూర్తి చేసి ఇప్పుడు ఘనాపాటి కోర్స్ నేర్చుకుంటున్నారు.

కోవిడ్ (COVID-19) మహమ్మారి సమయంలో అందరికంటే వేగంగా స్పందించి వైజాగ్ (Vizag) లో ఒక స్కూల్ ని 130 పడకల ఐసొలేషన్ సెంటర్ (Isolation Center) గా మార్చారు. 16 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ (Oxygen Concentrators) త్వరితగతిన అమెరికా నుంచి పంపారు. ఈ విషయంలో తానా కి కూడా సహాయం చేశారు. అంతే కాకుండా మెడికల్ పరికరాలు, ఇండస్ట్రియల్ మాస్క్స్ వంటివి అందించి కొందరి ప్రాణాలను సైతం కాపాడగలిగారు.

ఇలా ఇండియాలో చేసిన సేవలు ఒక ఎత్తైతే, అమెరికాలో చేసిన సేవలు మరొక ఎత్తు. స్థానిక TATA of NC (Triangle Area Telugu Association of North Carolina) వంటి తెలుగు సంఘాల దగ్గిర నుండి జాతీయ తెలుగు సంఘాల వరకు ఆర్ధికంగా సహాయం చేస్తూ డోనార్ గా మన్ననలు పొందారు. ఒక సామాన్య స్వచ్ఛంద (Volunteer) సేవకుని మాదిరి స్థానిక హిందూ టెంపుల్ లో సేవలందించడంలో ముందున్నారు.

ఫస్ట్ రోబోటిక్స్ నాన్-ప్రాఫిట్ సంస్థ ద్వారా పిల్లల్ని, యువతని నూతన సాంకేతికత వైపు మళ్లిస్తున్నారు. సృజనాత్మకతను పెంపొందించేలా నాయకత్వ పటిమ, కమ్యూనికేషన్ స్కిల్స్, టీం వర్క్ వంటి విషయాల్లో క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. అలాగే ఎటువంటి లాభాపేక్షలేని ఫస్ట్ రోబోటిక్స్ పోటీలకు (First Robotics Competition) ఆర్ధిక సహాయం చేస్తూ విద్యార్థులు కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) లో నైపుణ్యం సంపాదించే దిశగా శిక్షణ ఇస్తున్నారు.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) జీవితకాల సభ్యునిగా, ఫౌండేషన్ సభ్యునిగా 2014 నుంచి కొనసాగుతున్న విక్రమ్ ఇందుకూరి (Vikram Indukuri) ప్రస్తుత తానా ఎలక్షన్స్ లో 2023-27 కాలానికి డోనార్ విభాగంలో ఫౌండేషన్ ట్రస్టీ గా పోటీ చేస్తున్నారు. టీం కొడాలి (Team Kodali) ప్యానెల్ లో బలమైన అభ్యర్థిగా బరిలోకి దిగారు.

ఇప్పటి వరకు తను చేసిన సేవలను, ట్రాక్ రికార్డ్ చూసి గెలిపించవలసిందిగా (Vikram Indukuri) తానా సభ్యులను కోరుతున్నారు. తనను గెలిపిస్తే తానా ఫౌండేషన్ సేవాకార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తానంటున్నారు. వాటర్ ప్లాంట్స్, క్యాన్సర్ క్యాంప్స్, కమ్యూనిటీ హాల్స్, ప్లేగ్రౌండ్స్, 5కే వాక్/రన్ వంటి కార్యక్రమాలకు కృషి చేస్తానని, అలాగే తానా సమగ్రతను కాపాడతానన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected