ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మరియు అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ ఆధ్వర్యంలో ఆగస్టు 6వ తేదీన ఫోర్సైత్ కౌంటీ లైబ్రరీ సమావేశ మందిరంలో ‘వెయ్యేళ్ళ నన్నయ్య, నూరేళ్ళ నందమూరి’ సాహిత్య విభావరి నిర్వహించారు. ఉదయం 10 గంటల సమయం అయినప్పటికీ పిల్లలతో సహా దాదాపు 100 మంది హాజరయ్యారు. ప్రముఖ రచయత, సాహితీవేత్త డా. తాళ్లూరి ఆంజనేయులు గారు తన ఉపన్యాసంతో ఆహూతులను మంత్రముగ్ధులను చేశారు, సభకు హాజరైన ఆహూతులు పూర్తి దృష్టితో మరియు శ్రద్ధతో ఉపన్యాసాన్ని ఆలకించారు.
స్త్రీ గురించి ఆయన మాట్లాడిన తీరు, నన్నయ్య (ఆదికవి) మరియు శ్రీ. అన్నయ్య (ఎన్టీఆర్, అన్న గారు) యుగాలను అనుసంధానం చేస్తూ, తెలుగు నేల, భాష మరియు సాహిత్యానికి వారి విలువలను వివరించడం అద్భుతం. ప్రముఖ జర్నలిస్ట్ మరియు ఎడిటర్ శ్రీ. రవి పోణంగి, అవధాని మరియు తెలుగు భాషా పండితులు శ్రీ. సోమయాజులు నేమాని, రచయిత, సినీ దర్శకులు శ్రీ. ఫణి డొక్కా తమ అనుభవాలను, ఆలోచనలను పంచుకున్నారు.
డా. తాళ్లూరి ఆంజనేయులు గారు రాజమహేంద్రవరం, రాజరాజ నరేంద్రుడు మరియు శ్రీ. నన్నయ్య చరిత్ర గురించి మాట్లాడారు. శ్రీ. ఎన్టీఆర్ గారితో తనకున్న అనుబంధాన్ని, సంఘటనలు, సంభాషణలను గురూజీ ప్రేక్షకులతో పంచుకున్నారు. శ్రీ. నన్నయ, శ్రీ. నందమూరిలపై జరిగిన వ్యాసరచన పోటీల్లో పలువురు చిన్నారులు, పెద్దలు పాల్గొన్నారు. విజేతలకు డా. తాళ్లూరి ఆంజనేయులు గారు బహుమతులు అందజేశారు.
తామా ప్రెసిడెంట్ రవి కల్లి, సాయిరామ్ కారుమంచి, సురేష్ బండారు, రూపేంద్ర వేములపల్లి, సునీల్ దేవరపల్లి, తిరు చిల్లపల్లి, డైరెక్టర్లు సుబ్బారావు మద్దాలి, మధు యార్లగడ్డ, తానా రీజినల్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ మీసాల, వినయ్ మద్దినేని, హితేష్ వడ్లమూడి బృందం ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. తామా సాహిత్య కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గడ్డం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆమె అడిగిన ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయి, విజేతలకు బహుమతులు అందజేశారు.
హాజరైన వారందరికీ అల్పాహారం, పానీయాలు అందించారు. పిల్లలకు కథల పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శ్రీ ఆంజనేయులు గారికి, అతిథులకు, హాజరైన తామా మరియు తానా బృందాలకు రవి కల్లి మరియు సాయిరామ్ కారుమంచి కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.